Asianet News TeluguAsianet News Telugu

అభిమానులకు స్వయంగా భోజనం వడ్డించిన విక్రమ్.. వైరల్ వీడియో

నటన కోసం ఎంతకైనా రిస్క్ చేసే హీరో చియాన్ విక్రమ్. ఎంత కష్టతరమైన పాత్ర అయినా సరే పరకాయ ప్రవేశం చేసి మెప్పించడం విక్రమ్ స్టైల్.

Hero Vikram serves food to his fans viral video dtr
Author
First Published Aug 28, 2024, 12:13 PM IST | Last Updated Aug 28, 2024, 12:13 PM IST

నటన కోసం ఎంతకైనా రిస్క్ చేసే హీరో చియాన్ విక్రమ్. ఎంత కష్టతరమైన పాత్ర అయినా సరే పరకాయ ప్రవేశం చేసి మెప్పించడం విక్రమ్ స్టైల్. అందుకే విక్రమ్ తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ స్థాయిలో అభిమానులని సొంతం చేసుకున్నాడు. 

విక్రమ్ మరోసారి విలక్షణమైన నటనతో వచ్చిన చిత్రం తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో ఇటీవల ఈ చిత్రం విడుదలయింది. పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్ళని రాబడుతోంది. దీనితో రీసెంట్ గా సక్సెస్ మీట్ నిర్వహించారు. సక్సెస్ మీట్ లో విక్రమ్ పంచె కట్టులో చాలా సింపుల్ గా కనిపించారు. 

సక్సెస్ మీట్ కి హాజరైన అభిమానుల కోసం చిత్ర యూనిట్ భోజనాలు ఏర్పాటు చేసింది. హీరో విక్రమ్ స్వయంగా అభిమానులకు తన చేత్తో భోజనాలు వడ్డించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విక్రమ్ సింప్లిసిటీని నెటిజన్లు అభినందిస్తున్నారు. 

స్టూడియో గ్రీన్ సంస్థ తంగలాన్ చిత్రాన్ని నిర్మించింది. విక్రమ్ విచిత్రమైన వేషధారణలో నట విశ్వరూపం ప్రదర్శించారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, పార్వతి తిరువొతు నటించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios