Asianet News TeluguAsianet News Telugu

పబ్లిక్ లో విజయ్ దేవరకొండ బూతులు... జరగండ్రా నీ*** అంటూ రచ్చ, వైరల్ గా సెన్సేషనల్ వీడియో!

యాటిట్యూడ్ కి విజయ్ దేవరకొండ  ఆటిట్యూడ్ గా బాప్ అన్నట్లు ఉంటారు. పబ్లిక్ మీటింగ్స్ లో ఆయన స్పీచ్లు పలుమార్లు వివాదాస్పదం అయ్యాయి. ఆయన మాత్రం మారింది లేదు. తాజాగా విజయ్ దేవరకొండ బూతులు తిడుతున్న వీడియో వైరల్ అవుతుంది. 

hero vijay devarakonda cuss words in public video goes viral ksr
Author
First Published Apr 3, 2024, 4:47 PM IST

విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి మూవీతో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ మూవీలో హీరో క్యారెక్టరైజేషన్ వివాదాస్పదం అయ్యింది. ప్రియుడు ప్రేయసిని కొట్టడాన్ని పలువురు ఖండించారు. లిప్ లాక్ సన్నివేశాల మీద కూడా అభ్యంతరం చెప్పారు. అయితే రియల్ లైఫ్ లో కూడా విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్ అలానే ఉంటుంది. వేదికల మీద ఆయన పరుష వ్యాఖ్యలు చేస్తాడు. మితిమీరిన ఆత్మవిశ్వాసం ప్రకటిస్తాడు. తాజాగా ఆయన బూతులు తిడుతున్న వీడియో వైరల్ గా మారింది. 

ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ కొంచెం డిఫరెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ కుర్రాడి పాత్ర చేశాడు. ఈ పాత్రను రిప్రెజెంట్చేసేలా ... బైక్ పై ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యాడు. బైక్ వెనుక హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా కూర్చుని ఉంది. దాంతో విజయ్ బైక్ ని అభిమానులు చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీ వారిని అడ్డుకుంటున్నారు. 

బైక్ కి అడ్డంగా వస్తున్న అభిమానులను విజయ్ దేవరకొండ తిట్టారు. 'అరె జరగండ్రా నీ యబ్బా' అని గట్టిగా అరిచాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. అభిమానులను అలా పబ్లిక్ లో తిట్టడం ఏమిటని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పోతే ఫ్యామిలీ స్టార్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదల కానుంది. 

దర్శకుడు పరశురామ్ ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని తెరకెక్కించారు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. ఫ్యామిలీ స్టార్ చిత్ర ట్రైలర్ ఆకట్టుకోగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంతో రూ. 200 కోట్ల వసూళ్లు రాబడతానని విజయ్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. ఇక మృణాల్ కి తెలుగులో ఇది మూడో చిత్రం. సీతారామం, హాయ్ నాన్న విజయం సాధించిన నేపథ్యంలో ఫ్యామిలీ స్టార్ తో హ్యాట్రిక్ కొడుతుందేమో చూడాలి... 

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios