హీరో సుహాస్ జోరు మామూలుగా లేదుగా..మరో క్రేజీ మూవీ లాంచ్, టైటిల్ మాత్రం కేక
కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సుహాస్ ప్రస్తుతం చిన్న బడ్జెట్ చిత్రాలకు క్రేజీ హీరోగా మారాడు. సుహాస్ నటించిన చిత్రాలు వరుసగా విజయం సాధిస్తున్నాయి. కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ లాంటి చిత్రాల్లో హీరోగా నటిస్తూనే హిట్ 2 చిత్రంలో విలన్ గా ఆశ్చర్యపరిచాడు.
కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సుహాస్ ప్రస్తుతం చిన్న బడ్జెట్ చిత్రాలకు క్రేజీ హీరోగా మారాడు. సుహాస్ నటించిన చిత్రాలు వరుసగా విజయం సాధిస్తున్నాయి. కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ లాంటి చిత్రాల్లో హీరోగా నటిస్తూనే హిట్ 2 చిత్రంలో విలన్ గా ఆశ్చర్యపరిచాడు.
సుహాస్ ప్రస్తుతం అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే సుహాస్ మరో క్రేజీ చిత్రాన్ని ప్రారంభించడం విశేషం. సుహాస్ టాలీవుడ్ లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారుతుండడంతో అతడితో చిత్రాలు చేసేందుకు నిర్మాతలు ఎగబడుతున్నారు.
సుహాస్ కొత్త చిత్రం శుక్రవారం రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. డెబ్యూ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. మూవీ లాంచ్ కి హిట్ 2 డైరెక్టర్ శైలేష్ కొలను అతిథిగా హాజరయ్యారు. ఫ్యాన్ మేడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై బాలు, ఆచార్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ మూవీ గా ఫన్నీగా క్యాచీగా ఉండే అదిరిపోయే టైటిల్ ఫిక్స్ చేశారు. 'కేబుల్ రెడ్డి' అనే టైటిల్ చిత్రానికి ఖరారు చేశారు. సుహాస్ గత చిత్రాలు కాస్త సందేశాత్మకంగా తెరకెక్కాయి. కానీ ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ వినోదభరితంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. షాలిని కోడెంపూడి ఈ చిత్రానికి హీరోయిన్ గా ఎంపికైంది.
శైలేష్ కొలను తొలి క్లాప్ ఇచ్చి స్క్రిప్ట్ ని చిత్ర యూనిట్ కి అందించారు. దర్శకుడు శ్రీధర్ మాట్లాడుతూ త్వరలో షూటింగ్ ప్రారంభించి 20 రోజుల పాటు మొదటి షెడ్యూల్ కొనసాగిస్తాం అని అన్నారు. క్లీన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉండబోతోంది అని అన్నారు.