Asianet News TeluguAsianet News Telugu

పారాలింపిక్స్ విన్నర్స్ ని ప్రశంసల్లో ముంచెత్తిన ప్రభాస్, అనుష్క!

పారాలింపిక్స్ లో భారత క్రీడాకారులు సత్తా చాటారు.ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విన్నర్స్ కి అభినందంలు తెలియజేశారు. తాజాగా ఈ లిస్ట్ లో హీరో ప్రభాస్, అనుష్క చేరారు.

hero prabhas anushka congratulates Paralympics winners
Author
Hyderabad, First Published Sep 7, 2021, 10:03 AM IST

పారాలింపిక్స్ లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. ఐదు గోల్డ్, 8 సిల్వర్, 6 బ్రాంజ్ మెడల్స్ సాధించి, భారత పతాకం అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విన్నర్స్ కి అభినందంలు తెలియజేశారు. తాజాగా ఈ లిస్ట్ లో హీరో ప్రభాస్, అనుష్క చేరారు. ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రభాస్, అనుష్క విజేతలను కీర్తించారు. 


సాధారణ వ్యక్తులు అసాధారణమైన ఫైటింగ్ స్పిరిట్ తో అడ్డంకులు అధిగమించి విజయం సాధించారు. వారి విజయాన్ని గుర్తు చేసుకోవడం ద్వారా వాళ్లకు మరింత ప్రోత్సాహం ఇద్దామని అనుష్క ఇంస్టాగ్రామ్ లో కామెంట్ పెట్టారు. 


ఇక కఠిన శ్రమ, నిబద్ధతకు కృతఙ్ఞతలు. మీ విజయంతో భారత్ కీర్తి మరింత వెలిగిపోయేలా చేశారు... అంటూ ప్రభాస్ కామెంట్ చేయడం జరిగింది. పారాలింపిక్స్ విన్నర్స్ శుభాకాంక్షలు చెబుతూ అనుష్క, ప్రభాస్ చేసిన ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ వైరల్ గా మారాయి. 


మరో వైపు అనుష్క కొత్త చిత్రాల ప్రకటన  చేయడం లేదు. అనుష్క నటించిన చివరి చిత్రం నిశ్శబ్దం. ఈ మూవీ తెలుగు, హిందీ భాషలలో విడుదలైంది. ప్రభాస్ మాత్రం వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. ఆయన హీరోగా రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్ చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prabhas (@actorprabhas)

Follow Us:
Download App:
  • android
  • ios