కోలీవుడ్ స్టార్ హీరో మాధ‌వ‌న్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. తన కొడుకుని చూసుకుని పొంగిపోతున్నాడు.  ఇంతకీ ఇంతలా మాధ‌వ‌న్ కొడుకు ఏం సాధించాడు. ఆయన సంతోషానికి కారణం ఏంటీ.  

కోలీవుడ్ స్టార్ హీరో మాధ‌వ‌న్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. తన కొడుకుని చూసుకుని పొంగిపోతున్నాడు. ఇంతకీ ఇంతలా మాధ‌వ‌న్ కొడుకు ఏం సాధించాడు. ఆయన సంతోషానికి కారణం ఏంటీ. 

 సౌత్ హీరోలలో రొమాంటిక్ ఇమేజ్ ఉన్న హీరో మాధవన్. అప్పటి యూత్ లో యమా క్రేజ్ ఉండేది మాధవన్ అంటే. హ్యాండ్సమ్ హీరోల లిస్ట్ లో మాధవన్ ముందు ఉండేవాడు. ఇప్పుడు కూడా ఏజ్ బార్ అవుతున్నా.. అదే గ్లామర్ మెయింటేన్ చేస్తున్నాడు మాధవన్. ఫిల్మ్ కెరీర్ లో ఎన్నో సక్సెస్ లు చూసిన హీరో.. ఇప్పుడు తన కొడుకు సక్సెస్ ను చూసి పొంగి పోతున్నాడు. 

మాధవన్ తనయుడు వేదాంత్ మాధవన్ స్వింమ్మింగ్ పోటీల్లో ఇండియాకు సిల్వ‌ర్ మెడ‌ల్ సాధించి పెట్టాడు. కోపెన్ హాగ‌న్ లో జ‌రిగిన‌ డానిష్ ఓపెన్ 2022 పోటీల్లో 1500 మీ ఫ్రీ స్టైల్ ఈవెంట్ లో సిల్వ‌ర్ మెడ‌ల్ సాధించాడు. వేదాంత్ కు సిల్వ‌ర్ మెడ‌ల్‌ను ప్ర‌క‌టిస్తున్న వీడియోను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు మాధ‌వ‌న్‌. త‌న కొడుకు భార‌త‌దేశం గ‌ర్వించేలా చేశాడ‌ని సంతోషంలో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. 

View post on Instagram

మాధవన్ పోస్ట్ లో ఇలా రాశారు...వేదాంత్ మాధ‌వ‌న్ డానిష్ ఓపెన్‌లో భార‌త్ త‌ర‌పున సిల్వ‌ర్ మెడ‌ల్ అందుకున్నాడు. ప్ర‌దీప్ సార్‌, అన్సాద్‌కు ధ‌న్య‌వాదాలు. మీ అంద‌రి కృషి ఫ‌లించింది. మేమంతా చాలా గ‌ర్విస్తున్నాం అని సందేశాన్ని రాశాడు మాధవన్. ఇక దేశాన్ని మ‌రోసారి గ‌ర్వంగా త‌లెత్తుకునేలా చేసిన యువ చాంపియ‌న్ వేదాంత్‌కు బాలీవుడ్‌ న‌టి శిల్పాశెట్టి, న‌మ్ర‌తాశిరోద్క‌ర్ తోపాటు పలువురు సెలబ్రిటీలు నెటిజ‌న్లు, ఫాలోవ‌ర్లు శుభాకాంక్ష‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.