సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రకరకాల రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోన్న అనేక పుకార్లలో ఓ విషయం హాట్ టాపిక్ గా మారింది. అతడొక టాలెంటెడ్ హీరో.. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

కెరీర్ ఆరంభంలోనే సరికొత్త సినిమాల్లో నటిస్తూ జనాల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీలో అతడికి స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది. కానీ అతడిని వైఫల్యాలు వెంటాడాయి. తిరిగి పుంజుకొని సక్సెస్ అందుకుంటాడంటే అదీ జరగలేదు.

అదే సమయంలో అతడి వ్యక్తిగత జీవితంపై కూడా పెద్ద దెబ్బ పడింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అతడిని వదిలేసి వెళ్లిపోయింది. దానికి చాలానే కారణాలు ఉన్నాయట. దీంతో ఈ హీరో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడని.. సినిమా ఆఫర్ల కోసం ఆలోచించకుండా మందు, డ్రగ్స్ అంటూ మునిగితేలుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

కనీసం ప్లేస్ మారితేనైనా.. అతడిలో ఏదైనా మార్పు వస్తుందని కొద్దిరోజుల పాటు విదేశాలకు పంపించారట. కానీ అతడిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో కుటుంబసభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారట.