నిన్న గ్రాండ్ వెల్కమ్ తో ఇంటిలోకి ఎంటరైన బిగ్ బాస్ ఇంటి సభ్యుల కహానీ కొంచెం కొత్తగానే సాగింది. సాహో సాంగ్ తో మొదలైన వీరి డే వన్ చిన్న చిన్న గొడవలు, కొన్ని ఎమోషన్స్, కొంత ఫన్ తో సాగింది. హౌస్ లోకి ఎంటరైన రెండవ రోజే మోనాల్ ఎమోషనల్ స్టోరీతో ఏడిపించేసింది. తన విలేజ్ హౌస్, చనిపోయిన తండ్రి, బంధువులను తలచుకొని కన్నీటి పర్యన్తరం అయ్యింది. ఏడుస్తున్న మోనాల్ ని చూసి గంగవ్వ కూడా ఏడవడం కొసమెరుపు. 

ఇక వారంలో మొటిరోజు జరిగే నామినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. ఇంటి సభ్యులను ఏడు జంటలుగా చేసిన బిగ్ బాస్, ప్రతి ఒక జంట చెరో కిటికీ వద్ద నిల్చోవాలని, వారిద్దరిలో ఇంటి సభ్యులు ఒకరిని సేవ్ చేసి మరొకరిని ఎలిమినేషన్ కి నామినేట్ చేయాలని ఆదేశించారు. 

ఈ నామినేషన్ ప్రక్రియలో తమతమ ఇష్టాలు, మరియు కారణాల ఆధారంగా  ఒకరిని నామినేట్ చేసి మరొకరిని సేవ్ చేశారు. ఇంటి సభ్యులలో ఎక్కువమంది చేత ఎలిమినేషన్ కి నామినేట్ అయినవారు ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్ లో వచ్చి చేరారు. సూర్య కిరణ్, గంగవ్వ, మెహబూబ్, అభిజిత్, సుజాత, అఖిల్ సార్తక్, దివి మొదటివారానికి గానూ ఎలిమినేషన్ కి నామినేట్ కావడం జరిగింది. 

ఇక ఎపిసోడ్ 2 లో మోనాల్ గుజ్జర్ ఎమోషనల్ స్పీచ్, కరాటే కళ్యాణి, జోర్దార్ సుజాత మధ్య జరిగిన కొంచెం రగడ హైలైట్స్ అని చెప్పాలి. గంగవ్వ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని, ఆమెకు ప్రజల ఆశీస్సులు ఉంటాయని ఆమెను ఎక్కువ మంది నామినేట్ చేయడం కొసమెరుపు.