బిగ్ బాస్ సీజన్ 4 మొదటివారం పూర్తి చేసుకుంది. నేడు శనివారం కావడంతో  నాగార్జున వేదికపై ఎంట్రీ ఇచ్చారు. వారం రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ బిహేవియర్ పై ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా నోయల్ ని స్మార్ట్ అంటూ పొగుడుతూనే ఓవర్ థింకింగ్ అని ఎద్దేవా చేసారు. ఆ బిహేవియర్ వలన తన ఆటను పాడుచేసుకొని, ఇతరుల ఆటను పాడు చేశావ్ అన్నారు.  

కాగా దర్శకుడు సూర్య కిరణ్ కి బిహేవియర్ పై కూడా నాగార్జున అసంతృపి వ్యక్తం చేశారు. నీకు సంబంధం లేని విషయాలలో  ఎందుకు తలదూరుస్తున్నావ్ అన్నారు. నువ్వు డైరెక్టర్ కావడం వలన మిగతా కంటెస్టెంట్స్ అందరూ క్యారెక్టర్స్ అనుకుంటున్నావా అన్నారు.

అలాగే కరాటే కల్యాణిపై నాగార్జున కోప్పడ్డారు అని చెప్పొచ్చు. మిగతా సభ్యుల గురించి మోనాల్ కి కరాటే కళ్యాణి చెప్పిన చాడీలను నాగార్జున ప్రస్తావించారు. అక్కడ జరిగింది కాకుండా  కొంత నీ సొంత ఉద్దేశాలు ఎందుకు కలిపి చెవుతున్నావ్ అన్నారు.  ఇక లాస్య తన సొంత తత్త్వం వదిలేసిందని, అమ్మ రాజశేఖర్ చాలా రొమాంటిక్ అయ్యారని అన్నారు. చిన్న విషయాలకు కూడా ఏడ్చేస్తున్న మోనాల్ ని నాగార్జున నర్మదా అని పిలిచారు. ఏడుపు తగ్గించాలని సలహా ఇచ్చారు.

ఇక వారం రోజులుగా సాగుతున్న కట్టప్ప ఎవరన్న సస్పెన్సు కి నాగార్జున తెరదింపారు. అసలు హౌస్ లో కట్టప్ప అని ఎవరూ లేరని అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. హౌస్ మేట్స్ లో అత్యధిక మంది కట్టప్పగా భావించిన లాస్యను కట్టప్పగా భావించి, ఆమెకు లీడర్ ఆఫ్ ది హౌస్ గా ప్రకటించారు. దీనితో బిగ్ బాస్ హౌస్ సీజన్ 4 మొదటి లీడర్ గా లాస్య ఎంపికయ్యారు. ఇక మరో వారం వరకు లీడర్ గా ఆమె ఎలిమినేషన్ కావడం జరగదు. 

ఈ వారం ఎలిమినేషన్ ఉందని భావించవద్దు, ఎలిమినేషన్ ఉందని నాగార్జున తెలియజేశారు. ఈ వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన ఏడుగురు సభ్యులలో ఉత్కంఠ మధ్య ముగ్గురు సేవ్ అయ్యారు. ప్రేక్షకుల ఓట్ల ప్రకారం మొదటిగా అభిజిత్, తరువాత జోర్దార్ సుజాత మరియు గంగవ్వ ఎలిమినేషన్ నుండి బయటపడ్డారు. మిగిలిన సూర్య కిరణ్, దివి, అఖిల్ సార్థక్, మెహబూబ్ నుండి ఒకరు రేపు ఎలిమినేట్ కానున్నారు.