టీవీ సీరియల్స్ లో తప్ప మనకు సినిమాల్లో లేడీ విలన్స్ తక్కువే.  అందులోనూ విలన్ గా చేసే హీరోయిన్స్ కూడా దొరకరు కాబట్టి మనవాళ్లు అలాంటి యాంగిల్ టచ్ చేయటానికి ధైర్యం చేయరు. కానీ ఇప్పుడు నితిన్ తాజా చిత్రం భీష్మలో ఓ లేడీ విలన్ పాత్రను క్రియేట్ చేసారట. సినిమాని కీలకమైన మలుపులు తిప్పే ఆ నెగిటివ్ పాత్రలో హెబ్బా పటేల్ కనిపించనుందని సమాచారం.

అలా ఎలా సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయిన నార్త్ భామ హెబ్బా పటేల్‌. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ నిర్మాణంలో తెరకెక్కిన కుమారి 21 ఎఫ్‌ సినిమాతో బోల్డ్‌ క్యారెక్టర్‌లో నటించిన ఈ బ్యూటీ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తరువాత ఈడో రకం ఆడో రకం, ఎక్కడి పోతావు చిన్నవాడ వరస సినిమాలు చేసినా 24 కిసెస్ చిత్రం తర్వాత హెబ్బా కెరీర్‌  ఆగిపోయింది. దాంతో ఇప్పుడు నితిన్ సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించటానికి  సిద్దపడింది.

నితిన్‌ హీరోగా ‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున చిత్రం ‘భీష్మ’. రష్మికా మందన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ...పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను క్రిస్మస్‌ సీజన్‌లో రిలీజ్‌ చేయనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది.  ఈ సినిమాతో తనకు  మరోసారి బ్రేక్‌ వస్తుందన్న నమ్మకంతో హెబ్బా ఉంది.