పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ చిత్రంపై గతకొద్ది రోజులుగా వస్తున్న రూమర్లను తాజాగా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం కొట్టిపారేశారు. అలాగే చిత్రం రిలీజ్ డేట్ పైనా క్లారిటీ ఇచ్చారు.  

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) - దర్శకుడు క్రిష్ జాగర్లముడి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). రెండేండ్ల కింద నుంచే చిత్రంపై ఆసక్తి నెలకొల్పేలా చేశారు. గతేడాది నుంచే షూటింగ్ కు కసరత్తులు ప్రారంభమైనా నెటికీ పూర్తి కాలేదు. మొదటి నుంచి ఈ చిత్రానికి అడ్డంకులు ఏర్పడినట్టు తెలుస్తోంది. ఈ మేరకు చిత్రం వస్తుందా? రాదా? అనే సందేహాలు కూడా వినిపించేలా కథనాలు వచ్చాయి. తాజాగా వీటన్నింటిని కొట్టిపారేశాడు నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam). ఈ రోజుల మీడియా కంటపడ్డ ఆయన ‘హరి హార వీరమల్లు’ చిత్రంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఏఎం రత్నం మాట్లాడుతూ.. ‘హరిహర వీరమల్లు సినిమా ఆగిపోలేదు. చిత్రం కొనసాగుతోంది. సినిమాపై వచ్చిన పుకార్లన్నీ అవాస్తవాలే. సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నాం. అన్నీ కుదిరితే సినిమాను వచ్చే ఏడాది 2023 మార్చి 10న గ్రాండ్ గా రిలీజ్ చేయాలని భావిస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఒక్కో చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుండటంతో డేట్స్ ను లాక్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ‘హరి హర వీరమల్లు’ మేకర్స్ కూడా రిలీజ్ ప్లాన్ ను మొదలెట్టినట్టు తెలుస్తోంది. ఏదేమైన తాజాగా ప్రొడ్యూసర్ ఇచ్చిన క్లారిటీతో సినిమాపై అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇటు పవన్ అభిమానులూ ఖుషీ అవుతున్నారు. 

అక్రమాస్తుల వీర మల్లు మొఘలుల నుండి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే నేపథ్యంగా సినిమా సాగుతుందని, 17వ శతాబ్దంలో మెఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో కథ సాగుతుందని తెలుస్తోంది. పీరియడ్ యాక్షన్ అండ్ అడ్వెంచర్ ఫిల్మ్ ను దర్శకుడు క్రిష్ జాగర్లముడి (Krish) డైరెక్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది. అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ ఆయా పాత్రల్లో నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణీ సంగీతం అందిస్తున్నారు. 

Scroll to load tweet…