ఒక దర్శకుడు కెరీర్ కేవలం సక్సెస్ ల మీదే ఆధారపడతుందంటే నమ్మలేం. పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడు రకరకాల కారణాలతో నెక్ట్స్ ప్రాజెక్టు పట్టుకోలేక చూస్తూండిపోవచ్చు. అలాగే వరస డిజాస్టర్స్ ఇచ్చిన దర్శకులూ పెద్ద సినిమాలు ఓకే చేయించుకుంటూ ముంందుకు వెళ్తూండవచ్చు.  అందాల రాక్షసి ఫేమ్ హను రాఘవపూడి పరస్దితి చూస్తూంటే అదే అనిపిస్తుంది. తన మొదట సినిమా అందాల రాక్షసి కమర్షియల్ గా డిజాస్టర్ అయినా ఆ తర్వాత వరస సినిమాలు, యంగ్ హీరోలతో చేసాడీ దర్శకుడు. అలాగే రీసెంట్ గా శర్వానంద్ తో పడి పడి లేచే మనసు వంటి డిజాస్టర్ ఇచ్చాక కూడా ఇప్పుడు మరో భారీ సినిమా పట్టాడని సమాచారం. 

తన కెరీర్లో కాస్త డబ్బులు తెచ్చి పెట్టిన చిత్రం ఏదైనా ఉందీ అంటే అది కేవలం కృష్ణగాడి వీర ప్రేమ గాధ మాత్రమే. అయితేనేం తన మేకింగ్ తో అందరినీ మెప్పిస్తూండీ దర్శకుడు. మణిరత్నం ఇన్ఫూలియెన్స్ ఎక్కువగా ఉన్న ఈ డైరక్టర్ ఇప్పుడు బాలీవుడ్ లో ఓ ప్రాజెక్టుని ఫైనల్ చేయించుకున్నట్లు టాక్. భారీ బడ్జెట్ తో రూపొందబోయే ఆ చిత్రం ఓ పెద్ద కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. వచ్చే నెల నుంచి ఈ సినిమా పట్టాలు ఎక్కబోతోంది. ఈ సినిమాలో హీరో సన్నిడియోల్. ఇదో యాక్షన్ థ్రిల్లర్. ఇఖ ఈ సినిమాకు నిర్మాత అనీల్ శర్మ.

అనీల్ శర్మ, సన్నిడియోల్ కాంబినేషన్ లో గతంలో గదర్ ఏక్ ప్రేమ కథ చిత్రం వచ్చి సూపర్ హిట్టైంది. 2001లో వచ్చిన ఈ చిత్రం సన్నిడియోల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్. దాంతో అలాంటి మ్యాజిక్ ని రిపీట్ చెయ్యాల్సన భాధ్యత హను రాఘవపూడిపై పడింది. మరి హను కనక ఈ ఫీట్ ని సక్సెస్ ఫుల్ గా కనక నెరవేరిస్తే ...బాలీవుడ్ లో వరస సినిమాలు వస్తాయనటంలో సందేహం లేదు.