Asianet News TeluguAsianet News Telugu

మంచు విష్ణు ఇంట్లో యాపిల్ బ్యూటీ హన్సిక, పివి సింధు రచ్చ రచ్చ!

హన్సిక మంచు విష్ణు ఇంట్లో మెరిసింది. మరో సర్ ప్రైజ్ ఏంటంటే హన్సికతో పాటు తెలుగు తేజం ఒలంపిక్ మెడలిస్ట్ పివి సింధూ కూడా విష్ణు ఇంట్లో కనిపించింది.

Hansika Motwani and PV Sindhu at Manchu Vishnu's home
Author
Hyderabad, First Published Sep 3, 2021, 3:29 PM IST

హీరో మంచు విష్ణు, యాపిల్ బ్యూటీ హన్సిక మంచి స్నేహితులు. వీరిద్దరూ జంటగా పాండవులు పాండవులు తుమ్మెద, లక్కున్నోడు, దేనికైనా రెడీ లాంటి చిత్రాల్లో నటించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. హన్సిక తరచుగా విష్ణు కుటుంబ సభ్యులని కలుస్తూ ఉంటుంది. 

తాజాగా హన్సిక మంచు విష్ణు ఇంట్లో మెరిసింది. మరో సర్ ప్రైజ్ ఏంటంటే హన్సికతో పాటు తెలుగు తేజం ఒలంపిక్ మెడలిస్ట్ పివి సింధూ కూడా విష్ణు ఇంట్లో కనిపించింది. విష్ణు, వెరోనికా దంపతులు హన్సిక, పివి సింధూతో సరదాగా టైం స్పెండ్ చేశారు. 

ఇంట్లో వీరంతా రచ్చ రచ్చ చేస్తున్న పిక్స్ వైరల్ గా మారాయి. ఈ ఫోటోస్ ని విష్ణు సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ ఫోటోస్ కి 'మంకీ బిజినెస్' అని క్యాప్షన్ పెట్టాడు. దీనికి పివి సింధు 'లవ్ దిస్' అని.. హన్సిక 'వి క్యూట్' అని కామెంట్ పెట్టింది. 

ఇటీవల ఒలంపిక్స్ లో సింధూ బ్యాట్మింటన్ లో కాంస్య పతకం సాధించింది. అంతకు ముందు రియో ఒలంపిక్స్ లో సింధు సిల్వర్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే. ఇక విష్ణు త్వరలో జరగబోయే మా ఎన్నికలలో అధ్యక్ష బరిలో పోటీ చేస్తున్నాడు. ప్రకాష్ రాజ్, విష్ణు మధ్య ప్రధానంగా పోటీ జరగనున్నట్లు భావిస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios