గోపీచంద్ హీరోగా తిరు ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మించిన యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ `చాణక్య‌'.  ఈ చిత్రం లో గోపీచంద్ స‌ర‌స‌న మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.  అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్ 5న  ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని స‌న్నాహాలు చేస్తున్నారు. ఇక చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరా సినిమా సైతం అక్టోబర్ 2 న విడుదల అవుతున్న నేపధ్యంలో చాణుక్య సినిమాని ఏ ధైర్యంతో రిలీజ్ చేస్తున్నారని అందరూ ఆశ్చర్యపోతున్నారు.  ఇదే విషయాన్ని గోపీచంద్ ముందు సైతం ఉంచారు. దానికి గోపీచంద్ సమాధానం ఇచ్చారు.

గోపీచంద్ మాట్లాడుతూ.. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. అయితే నాకు ఈ సినిమా షూటింగ్ లో అయిన  యాక్సిడెంట్ కారణంగా రిలీజ్ వాయిదా పడింది.  అది అక్టోబర్ 3 వ తేదీకి వచ్చింది. అయితే ఒక నెల క్రితమే  సైరా అక్టోబర్ 2 వ తేదీన వస్తున్నానని ప్రకటన చేసింది. దాంతో చాలా మంది సినిమావాళ్లతో చర్చించి, అక్టోబర్ 5న మా సినిమా రిలీజ్ పెట్టారు నిర్మాతలు. అయినా సైరా, చాణుక్య రెండూ వేర్వేరు జానర్ ఫిల్మ్స్ . ఆడియన్స్ ఖచ్చితంగా రెండింటిని ఇష్టపడతారు అని అన్నారు.

ఇక చాణుక్య సినిమా అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసే విధంగా చిత్ర యూనిట్  ప్రమోషన్ డోస్ పెంచుతోంది.  ఈ మూవీ స్పై థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కింది. గోపిచంద్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కి కూడా మాంచి రెస్పాన్స్ దక్కింది.

ఇక నిర్మాతలు గోపీచంద్‌ను స‌రికొత్తగా చూపిస్తూ తెర‌కెక్కిస్తున్న చిత్రమిదని చెప్తున్నారు.  మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జ‌రీన్‌ ఖాన్ కీల‌క పాత్రలో న‌టిస్తున్నారు.  విశాల్ చంద్ర శేఖ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

‘పంతం’ సినిమా తర్వాత గోపీచంద్‌, మెహరీన్‌ జంటగా నటిస్తున్న సినిమా ఇది. తిరు దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.