గోపిచంద్ ‘సీటీమార్‌’ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ -మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న సినిమా ‘సీటీమార్’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మాస్ గేమ్ కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో ఉండనుంది. 

Gopichand Seetimaar Locks Release Date?

గోపీచంద్‌ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో కబడ్డీ నేపథ్యంలో  రూపొందిన చిత్రం ‘సీటీమార్‌’. ఇందులో తమన్నా హీరోయిన్‌గా నటించారు. భూమిక, దిగంగనా సూర్యవంశీ కీలక పాత్రలు పోషించారు. ఇందులో ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్‌ పాత్రలో గోపీచంద్, తెలంగాణ మహిళల కబడ్డీ కోచ్‌ పాత్రలో తమన్నా నటించారు. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 2న విడుదల కావాల్సింది. కానీ కరోనాతో  వాయిదా పడింది. మళ్లీ ఇప్పుడు థియోటర్స్ ఓపెన్ అయ్యి..ట్రాక్ లో పడటంతో రిలీజ్ డేట్ పై ఓ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. 

అందుతున్న సమాచారం మేరకు సీటిమార్ సినిమాని సెప్టెంబర్ 10న వినాయక చవతి కానుకగా  విడుదల చేయాలనీ మేకర్స్ భావిస్తున్నట్లు టాక్ నడుస్తుంది. మరి ఈ రీలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యిందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.  ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ పై అంతటా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో తమన్నా  తెలంగాణ యాసలో మాట్లాడారు. ఎలా మాట్లాడారో వినాలంటే సెప్టెంబర్  వరకూ ఆగాల్సిందే.

తమన్నా మాట్లాడుతూ –‘‘నన్ను నమ్మి ‘సీటీమార్‌’లో జ్వాలారెడ్డి పాత్రకు అవకాశం ఇచ్చినందుకు సంపత్‌కి థ్యాంక్స్‌. ఇందులో నా పాత్ర తెలంగాణ యాస మాట్లాడుతుంది’’ అన్నారు.  
  
 ఇక  ఈ సినిమా మాస్ గేమ్ కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో ఉండనుంది. ఇప్పటికే టీజర్ పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా పై ప్రేక్షకులలో ఓ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. అయితే సాలిడ్ సక్సస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న గోపీచంద్ ఆశలన్నీ ఈ సినిమా పనే పెట్టుకున్నాడు. ఇక సీటీమార్ సినిమాను  హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలు జోడించి రూపొందించారు నిర్మాత శ్రీనివాసా చిట్టూరి. మెలొడీ బ్రహ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ భూమిక కీలక పాత్ర పోషించింది. హాట్ బ్యూటీ అప్సరా రాణి ఐటెం సాంగ్ చేయడం విశేషం.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios