Asianet News TeluguAsianet News Telugu

నందలో నంది,గోపీచంద్ హన్సిక అందాలను తడిపేసారు

  • గోపీచంద్ హీరోగా సంపత్ నందది దర్శకత్వంలో తెరకెక్కిన గౌతమ్ నంద
  • హన్సిక, కేథరిన్ హీరోయిన్లు
  • ఈ మూవీలో హన్సికను తడిపేసిన వాన పాటల దర్శకుడు సంపత్ నంది
gopichand sampath nandi gautham nanda rain song wets hansika

‘ఏమైంది ఈ వేళ’ సినిమా తర్వాత దర్శకుడు సంపత్ నంది రామ్ చరణ్ ‘రచ్చ’ సినిమాతో ఒక్కసారిగా ట్రేడ్ వర్గాలలో హాట్ టాపిక్ అయ్యారు. కమర్షియల్ అంశాలతో సినిమాలను తీయడంలో నేర్పరి అన్న టాక్ తెచ్చుకున్న సంపత్ నంది వానపాటల్లో సిద్ధహస్తుడన్న టాక్ తెచ్చుకున్నాడు. రచ్చలో తమన్నాను వాన పాటలో తడిపించి హీరోయిన్లను వర్షం తడుపుతూ పాటలను చిత్రీకరించడంలో తను ముందుంటానని నిరూపించుకున్నాడు. ‘రచ్చ’ సినిమాలో హీరోయిన్ తమన్నా అందాలను వర్షంలో తడిపేస్తూ… చూపించిన పాట వీక్షకులకు కన్నులవిందును పంచిన విషయం తెలిసిందే. ఈ పాట కనిపిస్తే… మిల్కీ బ్యూటీ అందాలను రెప్పార్పకుండా చూసే వారున్నారు.

 

అంతేకాదు రవితేజతో తెరకెక్కించిన “బెంగాల్ టైగర్” సినిమాలోనూ మిల్కీ బ్యూటీ తమన్నా నాభి అందాలను చినుకుల నడుమ చూపించాడు సంపత్ నంది. అలా వాన పాటలలో హీరోయిన్ల సౌందర్యాలను వెలికితీస్తున్న సంపత్, తాజాగా తెరకెక్కించిన ‘గౌతమ్ నంద’ సినిమాలో హన్సిక అందాలను తడిపేసాడు. గౌతమ్ నందతో ప్రేక్షకులపై హన్సిక అందాల జల్లు కురిపింతబోతున్నట్లుగా టీజర్ సాంగ్ లో చూపించేసారు. హన్సికతోపాటు కేథరిన్ కూడా మెరిసింది. రీసెంట్ గా ఆడియో వేడుకలో ఈ పాటకు సంబంధించిన టీజర్ విడుదల చేయగా, యధావిధిగా వాన పాటను అద్భుతంగా చిత్రీకరించారు. ‘రచ్చ, బెంగాల్ టైగర్’ సినిమాలలోని పాటలకు ఏ మాత్రం తక్కువ కాకుండా హన్సిక కూడా అందాలను ఆరబోసినట్లుగా స్పష్టమవుతోంది. గోపీచంద్ పై అమాంతం వచ్చిపడటంతో ప్రేక్షకుల గుండెలో వాన జల్లుమంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios