గోపీచంద్ కు మాస్ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న గోపీచంద్ నుంచి చాణక్య చిత్రం వచ్చేస్తోంది. దసరా కానుకగా చాణక్య చిత్రం అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తిరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో గోపీచంద్ రా(RAW) ఏజెంట్ పాత్రలో నటించాడు. 

ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. గోపిచంద్ యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టినట్లే కనిపిస్తున్నాడు. తాజాగా చాణక్య చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు చాణక్య చిత్రానికి 'యూఏ' సర్టిఫికేట్ జారీ చేసింది. సెన్సార్ సభ్యుల నుంచి చాణక్య చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చినట్లు టాక్. 

రా ఏజెంట్ గా గోపీచంద్ చేయబోయే విన్యాసాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా చాణక్య చిత్రం మెగా స్టార్ సైరా మూవీ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కోవలసి ఉంటుంది. 

సైరా చిత్రం అక్టోబర్ 2న విడుదల కాగా మూడురోజుల గ్యాప్ లోనే చాణక్య చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సైరాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. కానీ దసరా సెలవులు ఉండడంతో చాణక్య చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం చిత్ర యూనిట్ లో ఉంది.