టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందా అని వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్  ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి నుంచి ప్రభాస్.. ఫ్యాన్స్ ని చాలా వెయిట్ చేయిస్తున్నాడు. వీలైనంత త్వరగా రెండు సినిమాలను 2020లో అందిస్తానని చెప్పిన రెబల్ స్టార్ ఇంతవరకు ఒక్క సినిమా రిలీజ్ డేట్ ని కూడా ఎనౌన్స్ చేయలేదు.

ప్రస్తుతం రాధా కృష్ణ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక చాలా రోజుల తరువాత ఆ సినిమా అప్డేట్ పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. రీసెంట్ గా ఒక సీక్వెన్స్ ని పూర్తి చేసినట్లు చెప్పిన దర్శకుడు రాధాకృష్ణ త్వరలో మరొక షెడ్యూన్ ని స్టార్ట్ చేయనున్నట్లు వివరణ ఇచ్చాడు. అలాగే ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేయనున్నారట. ప్రభాస్ కూడా సినిమా షూటింగ్ ని వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలనీ చూస్తున్నాడట.

ఇకపోతే సాహో సినిమా లోకల్ ఫ్యాన్స్ ని మెప్పించకపోయినప్పటికీ నార్త్ స్టేట్స్ లో మంచి సక్సెస్ ని అందుకుంది. బాహుబలి కారణంగా 70కోట్ల ధర పలికిన ఆ సినిమా బాలీవుడ్ బయ్యర్స్ కి మంచి ప్రాఫిట్స్ ని అందించింది. ఇక ఇప్పుడు నెక్స్ట్ సినిమా కూడా హిందీలో భారీగా రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు.  ఇప్పటికే యూవీ క్రియేషన్స్  'ఓ డియర్' అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించిన విషయం తెలిసిందే.