రిలీజ్ ఆగినట్లేనా... వర్మ, మియాలకు కోర్టు నోటీసులు

First Published 25, Jan 2018, 8:45 PM IST
god sex and truth makers gets notice
Highlights
  • రేపే వర్మ జీఎస్టీ విడుదల
  • కాపీ కొట్టి తీశారంటూ కోర్టులో పిటిషన్
  • వర్మ, మియాలకు నోటీసులు జారీ చేసిన కోర్టు

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ,  పోర్న్ స్టార్ మియా మాల్కోవా ప్రధాన పాత్రలో తెరకెక్కించిన వివాదాస్పద చిత్రం ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ). ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోర్న్ స్టార్ వెనుకున్న అసలు ఉద్దేశం ఏమిటో ఆ ట్రైలర్ లో మియా స్వయంగా వెల్లడించింది. దీనికి తోడు ఈ చిత్రంలో మియా మాల్కోవా శరీరంలోని అణువణువునూ చాలా స్పష్టంగా చూపిస్తున్నానని, ఇదొక శృంగార ఆధ్యాత్మిక కావ్యం అని వర్మ ప్రచారం చేస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం మరొక ప్రధాన ఆకర్షణ అని చెబుతున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఈ చిత్రాన్ని ఇంటర్నెట్‌లో విడుదల చేస్తున్నారు.అయితే మరోవైపు జీఎస్టీ స్క్రిప్ట్ తనదేనంటూ గత కొద్దిరోజులుగా ఆరోపిస్తున్న రచయిత జయకుమార్ ఇప్పుడు కోర్టుకెక్కారు. జయకుమార్ గతంలో వర్మ ‘సర్కార్ 3’ చిత్రానికి స్టోరీ రైటర్‌గా పనిచేసారు. జీఎస్టీ కథ తనదేనని, దాన్ని వర్మ కాపీ కొట్టి సినిమా తీసేశారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు రాంగోపాల్ వర్మ (ఆర్ కంపెనీ), మియా మాల్కోవా (యూట్యూబ్, వీమియో)కు నోటీసులు పంపింది.
 

2015 ఏప్రిల్ 1న ఈ స్క్రిప్టును తాను రాంగోపాల్ వర్మకు పంపానని జయకుమార్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే అప్పుడు ఈ స్క్రిప్టుపై ఆర్జీవీ అంత ఆసక్తి చూపలేదని, తనకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదని వెల్లడించారు. కానీ తాజాగా వచ్చిన ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ ట్రైలర్ చూసి షాక్ అయ్యానని, తన స్క్రిప్టును గుడ్డిగా కాపీ కొట్టారని ఆరోపించారు. ట్రైలర్ మియా మాల్కోవా మాట్లాడిన ప్రతి అక్షరం తన స్క్రిప్టులోదేనని జయకుమార్ వాదిస్తున్నారు.

loader