వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. అలియాస్ వివాదాల వర్మ మరో సంచలనానికి తెరతీశాడు. వివాదాలు, విమర్శలు, తిట్లు, నిరసనలు, ఆందోళనలు, కేసులు నేపథ్యంలోనే తన లేటెస్ట్ మూవీ ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ మూవీపై మరో సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. జనవరి 27న ఆన్‌లైన్‌లో విడుదలైన ఆర్జీవీ ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ ఉండటంతో ఈ సినిమాకు కొనసాగింపుగా ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్-2’ మూవీ త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు ట్వీట్ చేశారాయన.
 

‘పోర్న్ స్టార్ మియా మాల్కోవా నటించిన ‘జీఎస్టీ’కి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చూశాక జీఎస్టీ- 2ని వెంటనే ప్రారంభించాలని అనుకుంటున్నాను. ఆ భగవంతుడు, నా జీఎస్టీ లవర్స్ నాతో ఉంటారని నమ్ముతున్నా’ అంటూ ట్విట్టర్‌లో జీఎస్టీ-2 అప్డేట్స్ ఇచ్చాడు వర్మ. అయితే ఈ మూవీని మళ్లీ మియా మాల్కోవాతో రూపొందిస్తాడా? లేక మరో పోర్న్ స్టార్‌ను రంగంలోకి దించుతాడా అన్నది తేలాల్సిఉంది.

 


ఒకవైపు వర్మ భారతీయ సంస్కృతిని మంటకలుపుతున్నారంటూ ఆయన ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ వీడియోపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఈయనకు వ్యతిరేకంగా కేసులు కూడా నమోదయ్యాయి. ఈ తరుణంలో ‘జీఎస్‌స్టీ-2’ మూవీ తీస్తానంటూ మరింత వేడిరాజేశాడు వర్మ.