2020లో ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ తీవ్ర స్థాయిలో సంక్షోబాన్ని ఎదుర్కొంటుంది. కరోనా కారణంగా వేల కోట్ల నష్టాలతో పాటు వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. రీజినల్ ఇండస్ట్రీలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమల్లో కూడా అదే స్థాయిలో విషాదకర సంఘటనలు జరుగుతున్నాయి, తాజాగా ఓ హాలీవుడ్ నటి మరణం హాలీవుడ్ పరిశ్రమను విషాందలోకి నెట్టింది.

సోమవారం యూఎస్‌ అఫీషియల్స్‌ కాలిఫోర్నియా లేక్‌లో `గ్లీ` నటి నయ రివేర శరీరారన్ని గుర్తించారు. గత వారం తన నాలుగేళ్ల కొడుకుతో కలిసి లేక్‌లో విహారానికి వెళ్లిన నటి ప్రమాదవశాత్తు లేక్‌లో పడిపోయినట్టుగా భావిస్తున్నారు. రివేర బాడీని పరీక్షించిన అధికారులు ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని వెల్లడించారు.

పూర్తి స్థాయి అటాప్సీ రిపోర్ట్ కోసం ఆమె డెడ్ బాడీని మెడికల్ ఎగ్జామినర్‌ ఆఫీస్‌కు తరలించినట్టుగా అధికారులు వెల్లడించారు. అందులో భాగంగా డెంటల్ రిపోర్ట్ ద్వారా ఆ బాడీ రివేరాదే అని ధృవీకరించనున్నారని వెల్లడిచారు.

గత బుధవారం ఓ ప్రైవేట్‌ బోట్‌ను అద్దెకు తీసుకున్న నయా రివేరా.. తన నాలుగేళ్ల కొడుకుతో కలిసి షికారుకు వెళ్లింది. అయితే ప్రమాదవశాత్తు బోటు మునిగిపోవటంతో కొడుకు కాపాడే ప్రయత్నంలో రివేరా కూడా లేకలో మునిగిపోయిందని భావిస్తున్నారు. ప్రస్తుతం రివేరా మృతిపై విచారణ జరుగుతోంది.