Asianet News TeluguAsianet News Telugu

కుర్రాళ్లకు కిక్కిచ్చే 'గిచ్చి గిలి గిలి' సాంగ్.. పొట్టి బట్టల్లో అదితి గ్లామర్ ట్రీట్

కన్నడకు చెందిన యువ హీరో Srini, యంగ్ బ్యూటీ Aditi Prabhudeva జంటగా నటించిన చిత్రం 'ఓల్డ్ మాంక్'.  కన్నడ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ కావడానికి రెడీగా ఉంది. శ్రీని స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Gicchi Gili Gili Song from old monk movie
Author
Hyderabad, First Published Oct 23, 2021, 4:09 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కన్నడకు చెందిన యువ హీరో Srini, యంగ్ బ్యూటీ Aditi Prabhudeva జంటగా నటించిన చిత్రం 'ఓల్డ్ మాంక్'.  కన్నడ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ కావడానికి రెడీగా ఉంది. శ్రీని స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి 'గిచ్చి గిలి గిలి' అనే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. 

క్యాచీ బీట్ తో సాగే ఈ పాట యువతని ఆకట్టుకునే విధంగా ఉంది. సౌరవ్, వైభవ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ధనుంజయ్ సీపన ఈ సాంగ్ కి గాత్రం అందించారు. పూర్ణాచారి యూత్ ఫుల్ లిరిక్స్ ఇచ్చారు. కలర్ ఫుల్ గా సాగే ఈ పాటలో బీట్ స్టెప్పులేయించే విధంగా ఉంది. అలాగే కొరియోగ్రఫీ కూడా ఆకట్టుకుంటోంది. 

Also Read: ఆ లిస్టులో సారా అలీ ఖాన్.. ఇక సేఫ్ అంటూ దారుణంగా ట్రోలింగ్

ముఖ్యంగా హీరోయిన్ అదితి ప్రభుదేవా గ్లామర్ ఈ సాంగ్ కి పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. సాంగ్ మొత్తం యువతని ఆకర్షించేలా ఆమె పెర్ఫామ్ చేసింది. పొట్టి బట్టల్లో గ్లామర్ తో కట్టి పడేస్తోంది. హాట్ గా కనిపిస్తూనే స్టైలిష్ యాటిట్యూడ్ తో సాంగ్ లో అదితి హైలైట్ గా నిలిచింది. తెలుగు డబ్బింగ్ రైట్స్ ని ఆర్ కె నల్లం మరియు రవి కశ్యప్ లు కొనుగోలు చేశారు. త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. 

క్లాప్ బోర్డు ప్రొడక్షన్స్, స్టార్ వుడ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కన్నడలో ఈ చిత్రంపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. తెలుగులో కూడా త్వరలో ప్రమోషన్స్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios