నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలక్రిష్ణ 105వ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. గత కొంత నెలలుగా బాలయ్య బ్రేక్ ఇవ్వకుండా  షూటింగ్ లో పాల్గొంటున్నారు. మరో ప్రక్క ప్రమోషన్ టీమ్...  సినిమాకు సంబంధించిన స్టిల్స్ ని రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కి మంచి పండుగ చేస్తున్నారు. దాంతో సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

ఇంతకు ముందు ఎప్పుడులేని విధంగా సరికొత్త లుక్ లో బాలక్రిష్ణ నెక్స్ట్ సినిమాలో కనిపించబోతున్నట్లు పాజిటివ్ టాక్ వైరల్ అయ్యింది. అయితే ఈ చిత్రం టైటిల్ ని నిర్మాతలు ఫైనల్ చేసి ఇప్పటిదాకా ప్రకటించలేదు. రోజుకో టైటిల్ మార్కెట్లో ,మీడియాలో వినపడుతోంది. అయితే ప్రముఖ టీవి ఛానెల్ జెమినీవారు అత్యుత్సాహంతో ఈ సినిమా టైటిల్ ని లీక్ చేసేసారు.

వివరాల్లోకి వెళితే... నిర్మాతలు ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ కి పూర్తి చేస్తున్నారు. రీసెంట్ గా శాటిలైట్ హక్కులను ప్రముఖ తెలుగు ఛానెల్ జెమిని టీవీ కు ఫ్యాన్సీ రేటుకు ఇచ్చేసారు. వారు ఈ సినిమాకు రూలర్ అనే  టైటిల్ పెట్టారని ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు. ఈ సినిమా హక్కుల్ని అందుకున్నట్లు బాలక్రిష్ణ – సోనాల్ చౌహన్ కి సంబంధించిన లుక్ ని రిలీజ్ చేశారు.

ఈ టైటిల్ ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.  తమిళ సీనియర్ దర్శకుడు కేఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. జై సింహా అనంతరం బాలయ్య, రవికుమార్ కాంబినేషన్ లో వస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక బాలక్రిష్ణ సరసన సోనాల్ చౌహన్ హీరోయిన్ నటిస్తోంది. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై త్వరలోనే స్పెషల్ ఏనౌన్స్మెంట్ వెలువడనుంది.