Asianet News TeluguAsianet News Telugu

పోర్న్ ఆడవాళ్లే ఎక్కువ చూస్తున్నారు.. అందుకే వర్మకి మద్దతు-గాయత్రి

  • జీఎస్టీకిి కొత్త నిర్వచనం చెప్పి సంచలనానికి తెరలేపిన వర్మ
  • వర్మ జీఎస్టీపై మీడియాలో, సోషల్ మీడియాలో భారీయెత్తున చర్చ
  • వర్మ జీఎస్టీకి పూర్తి మద్దతిస్తున్నానంటున్న ఫిదా ఫేం నటి గాయత్రి గుప్తా

 

gayathri supports varma gst god sex and truth

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' విషయంలో కొందరు వర్మను విమర్శిస్తుంటే నటి, ‘ఫిదా' ఫేం గాయిత్రి గుప్తా మాత్రం సపోర్టుగా నిలుస్తోంది. వర్మ చేస్తున్న ఈ ప్రయత్నం చూసి తాను గర్వ పడుతున్నానంటోంది. పోర్న్ చూడటం, చూడకపోవడం పక్కన పెడితే దీనిపై ఓ చర్చకు తెరలేపినందుకు వర్మ జీఎస్టీకి మద్దతిస్తున్నానని గాయత్రి తెలిపింది. గత కొద్ది రోజులుగా జీఎస్టీపై చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటున్న గాయత్రి ఆదివారం జరిగిన ఓ ఛానెల్ కార్యక్రమంలో తన అభిప్రాయాలు కుండ బద్దలు కొట్టినట్లు తెలిపింది.

 

“నా దృష్టిలో పోర్న్ మంచిది కాదు. మన ఇండియాలో పోర్న్ చూడటం లీగల్ కానీ తీయడం ఇల్లీగల్. అయినా సరే ఇండియాలో పోర్న్ చూసే వాళ్లు ఎక్కువగా ఉన్నారు. వాటికి ఇక్కడ మార్కెట్ ఉంది కాబట్టే రామ్ గోపాల్ వర్మ ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' లాంటివి తీస్తున్నారు. ఒక వేళ ఇండియాలో  పోర్న్ చూడటం ఇల్లీగల్ అయితే ఇంటర్నెట్లో ఓపెన్ కాకుండా బ్యాన్ చేసి ఉండేవారు. అలాంటిదేమీ లేదు కదా. మోడీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో బ్యాన్ అంటూ ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. అందరూ చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇది చూడటం లీగలే కదా అని గాయిత్రి గుప్తా అభిప్రాయరడింది.

 

సెక్స్ అనేది ప్రతి మనిషికి ఒక అవసరం. మనకు ఆకలి తీర్చుకోవడానికి ఫుడ్ ఎలా అవసరమో.. శరీరానికి సంబంధించిన ఒక అవసరమైన సెక్స్ కోరికలు తీర్చుకోవడానికి సెక్స్ అనేది కూడా అవసరమే. గణాంకాలు చూస్తే మన ఇండియాలో పోర్న్ చూసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇండియాలో పోర్న్ చూసే ఆడవారి సంఖ్య ఎక్కువగా ఉందంది” గాయిత్రి.

 

ఇక వర్మ లాంటి వారు తీస్తున్న ఇలాంటి అశ్లీల చిత్రాలు 7వ తరగతి చదివేవారు చూస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్నకు... 7వ తరగతి అబ్బాయి చూడకూడదు అన్నపుడు యూట్యూబ్ లాంటి మాధ్యమాలు ఆ వయసు వారికి ఎందుకు అందుబాటులో ఉంచుతున్నాయి. అది ఆర్జీవి రెస్పాన్సిబిలిటీ కాదు అని సమాధానం ఇచ్చారు. ఆర్జీవీ లాంటి వారు అలాంటివి తీయడం వల్లే ఇపుడు మనం, మన సమాజం మైనర్ల గురించి ఆలోచిస్తున్నాం. మన దేశంలో నిర్భయ కేసు అయితే తప్ప ఇలాంటి కేసుల విషయంలో ఒక సీరియస్ నెస్ రాలేదు. నా దృష్టిలో ఆర్జీవి ఈ విషయంలో ఒక మూమెంట్ తీసుకొస్తున్నారు.

 

సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడాలా? వద్దా? అనే ఒక సందేహం ఉన్న మన సమాజంలో ఆర్జీవీ తీసిన ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' మూలంగా మీడియాలో ఓపెన్ డిబేట్స్ జరుగుతున్నాయి. సెక్స్ గురించి కాలేజీ పిల్లలు టీవీ స్టూడియోలకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇది మంచి పరిణామమే. వర్మ వల్ల సెక్స్ గురించి మనం అందరం ఓపెన్ గా మాట్లాడుకుంటున్నాం. ఆయన వల్ల ఈ అంశంపై ఇంత మార్పు వచ్చినందుకు గర్వంగా ఫీలవుతున్నాను.

 

 ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' వల్ల వర్మ తప్పేమీ చేయడం లేదు. మన దేశంలో అలాంటివి తీయడం నిషేదం కాబట్టి విదేశాల్లో తీశారు. దాన్ని మన దేశంలోని థియేటర్లలో రిలీజ్ చేయట్లేదు. పెద్దలకు మాత్రమే అందుబాటులో ఉండే ఒక డిజిటల్ మార్కెట్లో విడుదల చేస్తున్నారు. నచ్చిన వారు చూస్తారు, నచ్చని వారు చూడరు ఇందులో తప్పు ఉందని తాను భావించడం లేదు అని గాయిత్రి గుప్తా తెలిపారు.

 

సన్ని లియోన్ ఒక పోర్న్ స్టార్. ఆమె ఇండియాకు సంబంధించిన వ్యక్తి. ఒక పోర్న్ స్టార్. ఎక్కడ మార్కెట్ ఉందో అక్కడ పోర్న్ సినిమాలు చేసి పాపులర్ అయింది. ఇపుడు ఆమెను దేశం మొత్తం ఎందుకు సపోర్టు చేస్తోంది? ఆమెకు ఎందుకు అంత మంది అభిమానులు ఎలా ఉన్నారు? ఆమె దేశం బయట పోర్న్ సినిమాలు చేసినా... ఇండియాకు వచ్చిన తర్వాత ఎథిక్స్ కు కట్టుబడి ఉంది కాబట్టే ఇది సాధ్యమైంది. వర్మ కూడా ఎథిక్స్ కు కట్టుబడి ఉన్నారు అని గాయిత్రి గుప్తా అన్నారు.

ఫైనల్ గా తాను పోర్న్ సినిమాలకు వ్యతిరేకినని, అయితే వర్మ తీసిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ వల్ల మనం దాని గురించి చర్చ లేవనెత్తామని, ఈ చర్చలు చేయటం పట్ల తనకు ఆసక్తి వుందని, అందుకే వర్మ జీఎస్టీకి మద్దతు ఇస్తున్నానని గాయత్రి స్పష్టం చేసింది. దీనిపై మరింత చర్చ జరగాల్సిన అవసరం వుందని గాయత్రి పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios