తన గ్లామర్, నటనతో సౌత్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న నటి అనుష్క. ఎంతమంది కుర్రభామలు హీరోయిన్లుగా రాణిస్తున్న అనుష్క క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. స్టార్ హీరోల రేంజ్ లో అనుష్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు మార్కెట్ ఉందంటే ఆమె క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. 

కానీ అనుష్క మాత్రం బాహుబలి తర్వాత చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తోంది. బాహుబలి 2 తర్వాత అనుష్క కేవలం భాగమతి చిత్రంలో మాత్రమే కనిపించింది. ప్రస్తుతం నిశ్శబ్దం మూవీలో నటిస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుష్క వినికిడి లోపం, మాటలురాని దివ్యాంగురాలిగా నటిస్తోంది. మాధవన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. 

పవన్ కళ్యాణ్ ని కలసిన సురేందర్ రెడ్డి?.. ఏం జరుగుతోంది?

బాహుబలి తర్వాత నుంచి అనుష్కపై అనేక రూమర్లు వినిపించాయి. అనుష్క సినిమాలకు దూరం అవుతోందని.. త్వరలో పెళ్లి చేసుకోబోతోందని ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలని అనుష్క ఖండించింది. అనుష్కకు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల మార్కెట్ ఉన్న సంగతి వాస్తవమే. కానీ అనుష్కని ఆడియన్స్ గ్లామర్ రోల్స్ లో కూడా చూడాలని కోరుకుంటున్నారు. 

కానీ అనుష్క మాత్రం వరుసగా హీరోయిన్ సెంట్రిక్ కథలకే ప్రాధాన్యత ఇస్తోంది. తాజాగా స్వీటీ మరో హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్టుని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శత్వంలో ఈ చిత్రం ఉండబోతోందట. 

ప్రముఖ రచయిత గోవింద్ నిహ్లానీ రాసిన ఓ నవల ఆధారంగా గౌతమ్ మీనన్ అనుష్కతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు సమాచారం. ఈ మూవీలో తమిళ బిగ్ బాస్ ఫేమ్ అభిరామి కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. వేల్స్ ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.