మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త ప్రాజెక్టులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే  రెండు ప్రాజెక్టులలో బిజిగా ఉన్న చరణ్ వాటి  అనంతరం చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్టుకు పలువురు దర్శకులు పేర్లు వినపడుతున్నాయి.  తాజాగా ఆ లిస్టులోకి ‘మళ్ళీ రావా’ ఫేం గౌతమ్ తిన్ననూరి పేరు కూడా చేరింది. నాని హీరోగా తెరకెక్కిన ‘జెర్సీ’ సినిమాతో ఈ డైరెక్టర్ టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. రీసెంట్ గా రామ్ చరణ్, గౌతమ్ మద్య చర్చలు జరిగాయని మీడియాలో వార్తలు వచ్చాయి.

 అంతేకాకుండా రామ్ చరణ్ కు జెర్సీ చిత్రం తెగ నచ్చిందని, అతని డైరక్షన్ చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నట్లు వినపడింది. దాంతో ఈ విషయం కన్ఫర్మ్ చేసుకునేందుకు గౌతమ్ తో మీడియా వాళ్లు టచ్ లోకి వెళ్లారు. ఈ క్రమంలో తేలిన విషయం ఏమిటంటే..ఇది పులిహార వార్తే. గౌతమ్ తో రామ్ చరణ్ ప్రాజెక్టు ప్రస్తుతానికి ఏమీ లేదు. అయితే రామ్ చరణ్ ...జెర్శీ చూసి గౌతమ్ వర్క్ ని మెచ్చుకున్నది మాత్రం నిజం. 

ఇక గౌతమ్ తిన్ననూరి ఈ లౌక్ డౌన్ గొడవ లేకపోతే షాహిద్ కపూర్ తో జెర్శీ రీమేక్ పనుల్లో బిజీగా ఉందురు. కానీ కరోనా మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబైలో విజృంభిస్తున్న నేపధ్యంలో ఎప్పటికి షూటింగ్ లు మొదలు అవుతాయో చెప్పలేని పరిస్దితి. మొత్తం సెట్ అయ్యి..ఓ క్లారిటీకు రావటానికి ఆరు నెలలు నుంచి సంవత్సరం దాకా పట్టవచ్చు అంటున్నారు. 

ఇక రామ్ చరణ్ ...ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న చరణ్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీతో పాటుగా చరణ్.. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’లో కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.