Asianet News TeluguAsianet News Telugu

అఫీషియల్: ప్రభాస్ పోటీ సెక్స్ వర్కర్ గంగు బాయ్ తో...

గంగూబాయి కతియావాడి జూలై 30 రిలీజ్ న రిలీజ్ అవుతోంది. తాజాగా సినిమా ప్రకటన వచ్చింది. అయితే ఇదే రోజున ప్రభాస్ సినిమా రాధే శ్యామ్ రిలీజ్ అవుతోందని ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ సినిమా అనౌన్స్ అయ్యాక ఇంకెవరు దాని దగ్గరకు వెళ్లే సాహసం చేయరు అనుకున్నారందరూ. అయితే  ఇప్పుడు ఈ కొత్త ట్విస్ట్ వచ్చి పడింది. ఇప్పుడు ఎవరు వెనక్కి వెళ్తారు..ఎవరు ముందుకు వస్తారనేది ట్రేడ్ లో పెద్ద డిస్కషన్ గా మారింది. ఎందుకంటే గంగూబాయిపై కూడా బాలీవుడ్ లో  భారీ అంచనాలు ఉన్నాయి. 

Gangubai Kathiawadi to Clash with Prabhas Radhe Shyam jsp
Author
Hyderabad, First Published Feb 24, 2021, 4:13 PM IST


పెద్ద హీరోల గతంలో తమ సినిమాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకునేటప్పుడు లోకల్ గా మరో స్టార్ హీరో సినిమా రిలీజ్ లేకుండా చూసుకునే వారు. కానీ ప్యాన్ ఇండియా కానెప్ట్ వచ్చాక...దేశం మొత్తం సినిమాలు రిలీజ్ అవుతున్న నేపధ్యంలో అటు బాలీవుడ్ స్టార్స్ సినిమా రిలీజ్ డేట్స్ కూడా చూసుకుని తమ సినిమా రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకోవాల్సిన పరిస్దితి. అటు వాళ్లదీ ఇదే సిట్యువేషన్. ఇప్పుడు ఇదెంతా ఎందుకూ అంటే తాజాగా గంగు బాయ్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయటంతో మాట్లాడుకోవాల్సి వస్తోంది. గంగు బాయ్ అనేది అల్లాటప్పా సినిమా అయితే అసలు పట్టించుకోవాల్సిన పనిలేదు. కానీ ఆలియా భట్‌ ప్రధాన పాత్రలో సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. 


హుస్సేన్‌ జైదీ రచించిన ‘మాఫీయా క్వీన్స్‌ ఆఫ్‌ ముంబై’లోని ‘మేడమ్‌ ఆఫ్‌ కామతిపుర’ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘గంగూబాయి’ ప్రచార చిత్రాల్లో ఆలియా స్టన్నింగ్‌ లుక్‌తో ఆకట్టుకుంది. అజయ్‌దేవ్‌గణ్‌ ఒక ముఖ్యపాత్రలో నటిస్తుండటం విశేషం. ఈ సినిమా  జూలై 30 రిలీజ్ న రిలీజ్ అవుతోంది. తాజాగా సినిమా ప్రకటన వచ్చింది. అయితే ఇదే రోజున ప్రభాస్ సినిమా రాధే శ్యామ్ రిలీజ్ అవుతోందని ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ సినిమా అనౌన్స్ అయ్యాక ఇంకెవరు దాని దగ్గరకు వెళ్లే సాహసం చేయరు అనుకున్నారందరూ. అయితే  ఇప్పుడు ఈ కొత్త ట్విస్ట్ వచ్చి పడింది. ఇప్పుడు ఎవరు వెనక్కి వెళ్తారు..ఎవరు ముందుకు వస్తారనేది ట్రేడ్ లో పెద్ద డిస్కషన్ గా మారింది. ఎందుకంటే గంగూబాయిపై కూడా బాలీవుడ్ లో  భారీ అంచనాలు ఉన్నాయి. 

అయితే ఈ సినిమాలు రెండూ వేర్వేరు కథలు. వేర్వేరు జానర్లు. అలాగని గంగు బాయ్ ని తక్కువ చేసి చూడలేం. అందులోనూ అక్కడి నేటివిటీ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన రియల్ గ్యాంగ్ స్టర్ కథ కాబట్టి క్రేజ్ కూడా భారీగా ఉంటుంది. ఓ ప్రక్క తన మైదాన్ కు పోటీగా ఆర్ఆర్ఆర్ ని దింపారని గగ్గోలు పెడుతున్నారు బోని కపూర్ . ఈ నేపధ్యంలో ఇప్పుడు రాధే శ్యామ్ కు కాంపిటీషన్ కు తెచ్చిన గంగు బాయ్ గురించి ఏమనాలో.  

‘గంగూబాయి కతియావాడి’ కథ విషయానికి వస్తే ..హుస్సేన్‌ రాసిన పుస్తకం ప్రకారం 1960ల్లో గంగూబాయి తన ప్రేమికుడితో గుజరాత్ నుంచి  పారిపోయి ముంబయికి చేరుకుంది. మోసం చేసిన ప్రియుడు ఆమెను వ్యభిచార గృహాలకు  అమ్మేశాడు.అనంతరం తానే కొన్ని వ్యభిచార గృహాలను నడిపేది. అలా ఆమె ‘మేడమ్ ఆఫ్‌ కామతిపుర’గా పిలువబడింది. అప్పట్లో ఉన్న బడా ముంబయిడాన్‌లతో ఆమెకు పరిచయాలుండేవి. తర్వాత కాలంలో సెక్స్‌వర్కర్ల హక్కుల కోసం పోరాడింది. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారం చూపింది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios