రియల్‌ లైఫ్‌ డ్రామాతో దర్శకుడు సుజనారావు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తోన్న ప్యాన్‌ ఇండియా మూవీ 'గమనం'. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు మరియు సినిమాకు సంబంధించిన విషయాలు ఎక్సపెక్టేషన్స్ పెంచాయి. ఇక ఈ రోజు ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ట్రైలర్ విడుదల కాబోతుంది. మొత్తం అయిదు భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది. కనుక ట్రైలర్ ను కూడా అయిదు భాషల్లో విడుదల చేయబోతున్నారు. 

అయిదు భాషల్లో కూడా అయిదుగురు స్టార్స్ తో విడుదల చేయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగు ట్రైలర్ ను పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల చేయించబోతున్నారు. ఆ విషయాన్ని ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించారు. ఇక హిందీ వర్షన్ ట్రైలర్ ను సోనూసూద్.. తమిళ వర్షన్ ట్రైలర్ ను జయం రవి.. కన్నడ వర్షన్ ను శివరాజ్ కుమార్ మరియు మలయాళ వర్షన్ ట్రైలర్ ను ఫహద్ ఫసిల్ లు సోషల్ మీడియా ద్వారా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదల అయ్యేది రేపటి ట్రైలర్ లో ప్రకటించే అవకాశం ఉంది.

ఈ సినిమాలో నిత్యా కర్ణాటక గాయకురాలు శైల‌పుత్రీ దేవి పాత్రలో కనిపించనున్నారు.  ఈ సినిమాకు ప్రముఖ ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా మాటు స‌మ‌కూరుస్తుండగా.. జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. మేష్ క‌రుటూరి, వెంకీ పుష‌డ‌పు ల‌తో క‌లిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, క‌న్నడ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో నిత్యామీన‌న్‌, ప్రియాంకా జ‌వాల్కర్‌ శివ కందుకూరి కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నట్లు సమాచారం.