యూట్యూబ్ స్టార్, ఫన్ బకెట్ ఫేమ్ భార్గవ్  రేప్ కేసులో అరెస్ట్ కాబడ్డారని వార్తలు రావడం సంచలనంగా మారింది. 14ఏళ్ల మైనర్ బాలికను మానభంగం చేసిన కేసులో భార్గవ్ ని పోలీసులు అరెస్ట్ చేశారని సమాచారం. వైజాక్ పోలీసులు భార్గవ్ ని అరెస్ట్ చేయడంతో పాటు, అతనిపై పోక్సో(ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్స్ అబ్యూస్) యాక్ట్ క్రింద కేసు నమోదు చేశారట. 


యూట్యూబ్ యాంకర్ గా పేక్షకులకు  పరిచయం ఉన్న శివ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరి శివ చెబుతున్న విషయంలో ఎంత వరకు నిజమన్నది క్లారిటీ లేదు. ఏదో ప్రమోషనల్ స్టంట్ కోసం లేదా, తాము పాప్యులర్ కావడానికి కూడా ఇలాంటి పోస్ట్ పెట్టే అవకాశం కలదు. నిజంగా ఫేమస్ కావడానికి ఇలాంటి సున్నితమైన విషయాలను వాడుకోవడం చాల పెద్ద తప్పు అవుతుంది. 


అంత కాన్ఫిడెంట్ గా శివ పోస్ట్ పెట్టాడంటే ఆ వార్త నిజం కావచ్చనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళఅదే నిజం అయితే భార్గవ్ పెద్ద సమస్యలో ఇరుక్కున్నట్లే. పోక్స్లో చట్టం క్రింద కేసు నమోదు కావడం అంటే బయటపడడం అంత సులువైన విషయం కాదు.బాలికను మానభంగం చేసిన కారణంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. కాగా టిక్ టాక్ వీడియోలతో భార్గవ్ చాలా ఫేమస్ అయ్యాడు. యూట్యూబ్ కామెడీ షో ఫన్ బకెట్ ద్వారా అతడు నెటిజెన్స్ కి దగ్గరయ్యాడు.