మహేష్ సర్కారు వారి పాట థియేటర్స్ లో ఉండగానే ఓటీటీలో ప్రత్యక్షమైంది. సర్కారు వారి పాట డిజిటల్ రైట్స్ దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ రెంటల్ పెద్దతిలో స్ట్రీమింగ్ చేస్తుంది. కాగా ఈ చిత్ర ఉచిత ప్రదర్శనకు డేట్ ఫిక్స్ చేసింది.


మూడు వారాలు ముగియగానే సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. థియేటర్స్ లో ఇంకా సర్కారు వారి పాట రన్ కొనసాగుతుండగానే ప్రైమ్ లో రెంటల్ స్కీమ్ క్రింద ప్రదర్శిస్తున్నారు. అంటే అమెజాన్ సబ్స్రిప్షన్ ఉన్నపటికీ డబ్బులు చెల్లించి సినిమా చూడాలన్న మాట. రూ. 199 సర్కారు వారి పాట చిత్ర రెంటల్ గా అమెజాన్ ప్రైమ్ నిర్ణయించింది. సినిమాపై ఉన్న హైప్ క్యాష్ చేసుకునేందుకు ప్రైమ్ ఇలా చేసింది. 

అయితే సగటు మహేష్ (Mahesh Babu)ఫ్యాన్స్ ప్రైమ్ చర్యతో నిరాశ చెందారు. ఓటీటీలో కూడా ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాలా అంటూ ఆవేదన చెందారు. కాగా సర్కారు వారి పాట చిత్రాన్ని ఫ్రీగా వీక్షించేందుకు ప్రైమ్ డేట్ ఫిక్స్ చేసింది. జూన్ 23 నుండి సర్కారు వారి పాట ఉచితంగా స్ట్రీమ్ కానుంది. దానికి ఇంకా చాలా సమయం ఉన్న తరుణంలో ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. 

దర్శకుడు పరుశురాం పెట్ల రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సర్కారు వారి పాట తెరకెక్కించారు. అలాగే ఆయన ఈ చిత్రంలో చర్చించిన సామజిక అంశం ప్రేక్షకులకు నచ్చింది. భారీ కలెక్షన్స్ రాబట్టిన సర్కారు వారి పాట వరల్డ్ వైడ్ రూ. 250 కోట్ల గ్రాస్ రాబట్టింది. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఈ రేంజ్ వసూళ్లు సాధించడం ట్రేడ్ వర్గాలను విస్మయపరిచింది.

మూవీలో మహేష్ మేనరిజం, కీర్తితో రొమాన్స్, కెమిస్ట్రీ, యాక్షన్ సన్నివేశాలు అక్కటుకున్నాయి. తమన్ మ్యూజిక్ సినిమాకు మరో హైలెట్ అని చెప్పాలి. మొత్తంగా సర్కారు వారి పాట మహేష్ కెరీర్ లో హిట్ మూవీగా నిలిచింది. ఫస్ట్ షో నుండే ఈ చిత్రంపై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ కావడంతో ఓపెనింగ్ వసూళ్లను సర్కారు వారి పాట కోల్పోయింది. ఆ ప్రభావం సెకండ్ డే పై విపరీతంగా పడింది. మూడో రోజు నుండి వర్డ్ ఆఫ్ మౌత్ తో సినిమా పుంజుకుంది.