దిల్ రాజు ద్వితీయ వివాహం చేసుకున్నారు. నిఖిల్ కూడా ఈ రోజు వివాహం చేసుకున్నారు. నితిన్ ఇవాళో రేపో తన పెళ్లి తేదీని ప్రకటించబోతున్నారు. రానా తన ఫియాన్సీ పేరుని ఆల్రెడీ ప్రకటించారు. ఆయన కుటుంబం అంతా పెళ్లి సన్నాహాల్లో మునిగితేలుతున్నామని సురేష్ బాబు చెప్పారు. వరుణ్ తేజ్ వచ్చే సంవత్సరం పెళ్లి అన్నారు. ఈ లాక్ డౌన్ టైమ్ లో వరస పెట్టి టాలీవుడ్ సెలబ్రెటీల వివాహాలు జరుగుతున్నాయి.  ఈ క్రమంలో నెక్ట్స్ ఎవరు అనగానే అందరి దృష్టీ ఒకే హీరోపై పడింది. ఆ హీరోనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. 

దాంతో కొందరు మీడియా వాళ్లు ప్రభాస్ కూడా ఈ లాక్ డౌన్ టైమ్ లోనే తన వివాహ ప్రకటన చేయటానికి నడుం బిగించారు. ఆల్రెడీ పిల్లని చూసే పోగ్రామ్ మొదలెట్టేసారు అంటూ వార్తలు మొదలెట్టేసారు. ఆ వార్తలు చూసి నవ్వుకోవటం ప్రబాస్ వంతు అయ్యిందిట. ప్రభాస్ కు ఈ లాక్ డౌన్ టైమ్ లో హఠాత్తుగా పెళ్లి ప్రకటన చెయ్యాలనే కోరిక లేదట. చక్కగా తన వాళ్లతో లాక్ డౌన్ టైమ్ లో రిలాక్స్ అవుతున్నారట. కాబట్టి కాస్త రూమర్స్ గ్యాప్ ఇస్తే బెస్ట్ అంటున్నారు ఫ్యాన్స్. 
  
 వాస్తవానికి బాహుబలి సినిమాకు ముందుకు ప్రభాస్ పెళ్లి జరుగుతుందని అనుకున్నారు.  బాహుబలి తరువాత పెళ్లి అన్నారు.  సాహో తరువాత పెళ్లి విషయం గురించి ఆలోచిస్తానని చెప్పిన ప్రభాస్ ఇప్పుడు రాధాకృష్ణ కుమార్ తో ఇంకా పేరు పెట్టని సినిమా చేస్తున్నారు.  ఈ క్రమంలో ఆ మధ్య ప్రభాస్ పెళ్లి విషయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ప్రభాస్ పెద్దమ్మ.  ప్రభాస్ పెళ్లి విషయంలో వస్తున్న వార్తలను చూసి నవ్వుకుంటున్నామని, ప్రస్తుతం చేస్తున్న సినిమా తరువాత ప్రభాస్ పెళ్లి ఉంటుందని అన్నారు.  తమది పెద్ద కుటుంబం అని, కుటుంబంలో కలివిడిగా ఉండే అమ్మాయి కోసం చూస్తున్నామని ఆమె పేర్కొన్నారు.