Asianet News TeluguAsianet News Telugu

సినిమా అవకాశమని చెప్పి.. ఫోర్న్ మూవీ షూట్, పోలీస్ దాడి

సినిమాల పేరు చెప్పి అమ్మాయిలను ఎట్రాక్ట్ చేసి ఆ తర్వాత వారిని వ్యభిచారంలోకి దించటం చాలా సార్లు విన్నాం. అలాగే ఆల్రెడీ సినిమాల్లో, టీవీల్లో చేస్తున్నవారు ఆ డబ్బు చాలకో లేక జల్సాలకు అలవాటు పడో వ్యభిచార వృత్తిలోకి వచ్చేసి పట్టుబడటమూ జరుగుతోంది. అయితే ఇప్పుడు మరో రాకెట్ బయిలుదేరింది. సినిమాలు పేరుతో ఎట్రాక్ట్ చేసి, ఆ తర్వాత వారితో బూతు సినిమాలు సినిమాలు తీయటం పనిగా పెట్టుకుంటున్నారు. ఇలాంటివి ఇప్పుడు సిటీల్లో సినిమా నిర్మాణాల జరిగే చోట చోటు చేసుకుంటున్నాయి. అలాంటి సంఘటన ఒకటి రీసెంట్ గా ముంబైలో జరిగింది. పోలీస్ లు ఆ గుట్టు రట్టు చేసి, అరెస్ట్ చేసారు.
 

Five held after live porn video-making racket busted jsp
Author
Hyderabad, First Published Feb 6, 2021, 6:29 PM IST

వివరాల్లోకి వెళ్తే.. ముంబైలో సైలెంట్  ఓ ప్రైవేట్ బంగ్లాలో గుట్టుగా సాగుతున్న పోర్న్ చిత్రాల షూటింగ్ ని పోలీస్ లు బట్టబయలు చేసారు. పోర్న్ సన్నివేశాల రికార్డ్ చేస్తున్న సమయంలో దాడిచేసిన పోలీసులు ఆ ముఠా గుట్టును రట్టు చేయటం జరిగింది. ఈ ఘటన ముంబై మలాడ్‌లోని మద్ ఐస్లాండ్‌లో చోటుచేసుకుంది.  

పోలీస్ లు చెప్పిన దాని ప్రకారం... "ఓ గ్యాంగ్ సినిమాల్లో కొత్తవారికి అవకాశాలు ఇప్పిస్తామని అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చి.. అలా వచ్చిన వారిని బంగ్లాలకు తరలిస్తున్నట్టుగా సమాచారం అందింది. అక్కడ వారికి పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపి అభ్యంతకర సీన్లలో నటించపజేస్తున్నారు. అగ్రీమెంట్లు రాయించుకుని బలవంతంగా పోర్న్ మూవీస్‌లో నటించేలా ఒత్తిడి చేస్తున్నారు" అని సీనియర్ ఇన్‌స్పెక్టర్ కేదారి పవార్ తెలిపారు. 

మద్ ఐస్లాండ్‌లోని ఓల్డ్ ఫెర్రీ మార్గ్‌‌లోని గ్రీన్ పార్క్ బంగ్లాలో పోర్న్ చిత్రాల షూటింగ్ జరుగుతున్న సంగతి ఇన్ఫర్మేషన్ అందింది. దాంతో పథకం ప్రకారం కాపుకాచి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడులు చేశారు. షూటింగ్‌ జరుపుతున్న ప్రొడక్షన్ హౌస్‌కు చెందిన ఐదుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వారిలో ఒకరు ఫొటో గ్రాఫర్ కాగా, మరోకరు గ్రాఫిక్ డిజైనర్‌.. వీరు లైవ్‌లో పోర్న్ వీడియోలను రికార్డు చేస్తుండగా పట్టుకున్నారు.

అరెస్ట్ అయిన ఇద్దరు మహిళలు ఈ గ్యాంగ్‌లో భాగమేనని చెప్పారు.. వారు యువతులని సినిమాలు పేరు చెప్పి ఆకర్షించి, ఆఫర్స్ ఇప్పిస్తామని, మంచి బ్రేక్ ఇప్పిస్తానని నమ్మించి ఈ బూతు కూపంలోకి నెట్టివేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ దాడుల్లో 25 ఏళ్ల ఓ మహిళను రక్షించినట్టుగా పోలీసులు తెలిపారు. ఆమెను పునరావాస కేంద్రానికి తరలించినట్టు చెప్పారు. ఇక, అరెస్ట్ చేసిన ఐదుగురిపై పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

అంతేకాకుండా ఆ ప్రొడక్షన్ హౌస్ బ్యాంక్ అకౌంట్‌లో రూ. 36.5 లక్షలు గురించామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రకాశ్ జాదవ్ తెలిపారు. ఈ మొత్తం నిందితులు వీడియోలు అప్‌లోడ్ చేసే పోర్న్ వీడియోల సబ్‌స్క్రిప్షన్స్ వల్ల వచ్చిందన్నారు. నిందితుల వాట్సప్ చాట్స్, బ్యాంక్ లావాదేవీలు పరిశీలిస్తే నిందితులు గత ఏడాదిన్నర కాలంగా ఈ దందా కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోందని పోలీసులు తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios