Asianet News TeluguAsianet News Telugu

సిల్క్ స్మిత ..అర్ద నగ్న పోస్టర్ ప్రేరణతోనే షకీలా

దాదాపు  ఇరవై ఏళ్లపాటు సౌతిండియాలో శృంగార తార‌గా ఓ వెలుగు వెలిగిన న‌టి ష‌కీలా. ప్ర‌స్తుతం ఆమె జీవిత నేప‌థ్యంలో ష‌కీలా అనే బ‌యోపిక్ రూపొందుతుంది.

first look inspired by silk smitha's film
Author
Hyderabad, First Published Nov 27, 2018, 8:07 AM IST

దాదాపు  ఇరవై ఏళ్లపాటు సౌతిండియాలో శృంగార తార‌గా ఓ వెలుగు వెలిగిన న‌టి ష‌కీలా. ప్ర‌స్తుతం ఆమె జీవిత నేప‌థ్యంలో ష‌కీలా అనే బ‌యోపిక్ రూపొందుతుంది. ఇంద్ర‌జిత్ లోకేష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టి రిచా చ‌ద్దా .. ష‌కీలా పాత్రని పోషిస్తుంది. రీసెంట్‌గా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. 

ఇందులో నేను పోర్న్ స్టార్ కాదు అని క్యాప్షన్ ఉండ‌డం సినిమాపై ఆస‌క్తిని క‌లిగించింది.  ఇందులో రిచా భారీ న‌గ‌ల‌తో స‌రికొత్త లుక్‌లో క‌నిపిస్తుంది. పోస్ట‌ర్ బ్యాక్ గ్రౌండ్‌లో హిందీ ప‌దాలు రాసి ఉన్నాయి. ఇలా నగ్న శరీరాన్ని  నగలతో కప్పేసినట్లుగా ఫస్ట్ లుక్ వదలటానికి ప్రేరణ...సిల్మ్ స్మిత సినిమా అంటున్నారు. 

సిల్మ్ స్మిత వెలుగుతున్న రోజుల్లో నటించిన అడల్ట్ ఫిలిం మిస్ పమేలా లో ఇలా సిల్క్ స్మిత సైతం..నగలతో కప్పేసిన నగ్న శరీరంతో దర్శనమిస్తుంది. ఈ విషయాన్ని రిచా చద్దానే రివీల్ చేసింది. తాము ఈ పోస్టర్ తో సిల్క్ కు హోమేజీగా భావిస్తున్నామని టీమ్ అంటోంది. 

తెలుగు‌తో పాటు హిందీ, మలయాళం, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం నిరుపేద నుంచి ధనికురాలై మళ్లీ పేదగా మారిన వ్యక్తి కథగా రూపొంద‌తుంద‌ని స‌మాచారం. మ్యాజిక్‌ సినిమా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ష‌కీలా కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు.వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో  షకీలా జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలన్నీ ఈ చిత్రంలో ఉంటాయని సమాచారం. తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను దాచిపెట్టకుండా చిత్ర యూనిట్ కి తెలిపానని షకీల  చెప్పారు.  ఈ చిత్రం షూటింగ్‌ దాదాపు పూర్తి కావొచ్చింది. తన జీవిత కథతో తెరకెక్కుతోన్న సినిమాలో షకీల అతిథి పాత్రలో కనపడనుంది. అతిథి పాత్రలో నటించమని ఇంద్రజిత్‌ లంకేష్‌ కోరడంతో  చేస్తున్నారామె. 

ఈ సినిమా కోసం రిచా ప్ర‌స్తుతం మ‌ల‌యాళం నేర్చుకుంది. అలాగే ష‌కీలాతో మాట్లాడి ఆమె జీవితం గురించి కూడా తెలుసుకుంది. ద‌క్షిణాది భాష‌ల‌న్నింటిలోనూ ఈ సినిమా విడుద‌ల కాబోతోంది.    సిల్క్ స్మిత జీవిత‌క‌థ ఆధారంగా ఆ మధ్యన తెర‌కెక్కిన `డ‌ర్టీపిక్చ‌ర్‌` త‌ర‌హాలో ఈ ష‌కీలా బ‌యోపిక్ కూడా ఆక‌ట్టుకుందని దర్సక,నిర్మాతలు భావిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios