Asianet News TeluguAsianet News Telugu

ఆల్ హ్యాపీస్..చైతు ట్వీట్ కు స్పందించిన సమంత.. లవ్ స్టోరీ ట్రైలర్ పై కామెంట్

సమంత, నాగ చైతన్య సౌత్ లో మోస్ట్ రొమాంటిక్ కపుల్. ఏ మాయ చేశావే చిత్రంతో మొదలైన వీరిద్దరి ప్రయాణం అందమైన ప్రేమ, పెళ్లి వరకు సాగింది. ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టి మూడేళ్లు పూర్తి కావస్తోంది.

Finally Samantha responds to Naga Chaitanya tweet
Author
Hyderabad, First Published Sep 13, 2021, 4:27 PM IST

సమంత, నాగ చైతన్య సౌత్ లో మోస్ట్ రొమాంటిక్ కపుల్. ఏ మాయ చేశావే చిత్రంతో మొదలైన వీరిద్దరి ప్రయాణం అందమైన ప్రేమ, పెళ్లి వరకు సాగింది. ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టి మూడేళ్లు పూర్తి కావస్తోంది. ఇటీవల చై సామ్ విడిపోతున్నారు అంటూ వస్తున్న వార్తలు అభిమానులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. 

ఈ రూమర్స్ ఎక్కువవుతున్నప్పటికీ చై, సామ్ స్పందించక పోవడం అనుమానాలు పెరిగాయి. సమంత సోషల్ మీడియాలో తన పేరులో నుంచి అక్కినేని తొలగించినప్పటి నుంచి ఈ రూమర్స్ మొదలయ్యాయి. ఎట్టకేలకు సమంత ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పెట్టేసింది. 

నాగ చైతన్య ట్వీట్ కు సమంత స్పందించడంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ చిత్ర ట్రైలర్ నేడు విడుదలయింది. శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకుడు. చైతూకి జోడిగా సాయి పల్లవి నటించింది.

ట్రైలర్ పై తన స్పందన తెలియజేస్తూ సమంత అందరినీ ఆశ్చర్యపరిచింది. నాగ చైతన్య ట్విట్టర్ లో లవ్ స్టోరీ ట్రైలర్ పోస్ట్ చేయగా.. దానిని కోట్ చేస్తూ సామ్ స్పందించడం విశేషం. ఇక ట్రైలర్ పై సామ్ 'విన్నర్' అని కామెంట్ పెట్టింది. చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపింది. 

సమంత చేసిన ఈ ట్వీట్ తో అనుమానాలకు తెరపడినట్లే అని భావించాలి.

 

Follow Us:
Download App:
  • android
  • ios