Asianet News TeluguAsianet News Telugu

సెక్స్ ఇండియాలో లీగలే కదా, జీఎస్టీపై ఉలికిపాటెందుకు-గాయత్రి గుప్తా

  • రామ్ గోపాల్ వర్మ జీఎస్టీ తప్పేం కాదంటున్న ఫిదా గాయత్రి
  • స్త్రీ అందాన్ని సెలెబ్రేట్ చేయటం తప్పేంకాదంటున్న గాయత్రి
  • మనం బట్టలేసుకునేది ప్రకృతి నుండి రక్షణకే తప్ప నగ్నంగా వుండొద్దని కాదు
fidaa gayathri guptha supports ramgopal varma GST god sex and truth

వర్మ గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ పై గాయత్రి గుప్తా ఓ టీవీ ఛానెల్ లైవ్ లో స్పందించారు. వర్మ విడియోపై చర్చా కార్యక్రమం చేపట్టిన ఓ న్యూస్ ఛానెల్ డిబేట్ లో పాల్గొన్న గాయత్రి గుప్తా వర్మ విడియోపై తన అభిప్రాయాలను కుండ బద్ధలు కొట్టినట్లు వెల్లడించారు. ఇటీవల కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన గాయత్రి గుప్తా మరోసారి తన అభిప్రాయాలను బోల్డ్ గా వెల్లడించారు.

 

స్త్రీ స్వేచ్ఛ అనేది వ్యక్తిగతం. నేను నా లైఫ్ తో ఏం చేయాలనుకుంటానో అది నాకు సంబంధించింది. పోర్న్ చూడటం మనం దేశంలో లీగల్ అయినప్పుడు నగ్నంగా తీసి జీఎస్టీ లాంటి క్రియేటివ్ చిత్రం రూపొందించటంలో తప్పేం లేదని గాయత్రి అభిప్రాయపడ్డారు. పోర్న్ అంటే ఆడ మగ సంభోగించడాన్ని చూపించడం అనుకుంటే జీఎస్టీ తో దాన్ని క్రియేటివ్ గా చూపించటానికి వర్మ తన క్రియేటివిటీని ఉపయోగించారనటం, దాన్ని క్రియేటివ్ వర్క్ అనటంలో సందేహం అక్కర్లేదు.

 

అణచివేతకు గురైన స్త్రీ స్వేచ్ఛకు సమాధానం చెప్తానని వర్మ అంటున్నాడు. మన దేశంలో పురాణాల కాలం నుంచే సెక్స్ ను సెలిబ్రేట్ చేశారని, కామసూత్ర ఈ దేశంలో పుట్టిందేనని, ఇక గుడులలో శిల్పాలు చెక్కి మరీ సెక్స్ ను సెలెబ్రేట్ చేసిన మన దేశంలో పోర్న్ విడియోలు, నటీమణులను, నటులను నగ్నంగా చిత్రీకరించిన దృశ్యాలను ప్రసారం చేయడంలో పెద్ద విశేషం ఏముందని గాయత్రి ప్రశ్నిస్తున్నారు. మన దేవతలకు మొత్తం బట్టలు కప్పలేదు. ప్రతీది వున్నదే. దాన్ని ఏదో దాచిపెట్టాల్సిన అవసరం లేదని గాయత్రి అభిప్రాయపడింది. అలా దాచిపెట్టడం వల్లనే క్యూరియాసిటీ ఎక్కువై క్రైమ్ రేట్ కూడా పెరగటానికి దోహదం చేస్తోందని తాను నమ్ముతానని గాయత్రి అంటోంది. సెక్స్ ను అదేదో రహస్యం అనేలా కాకుండా... అది చాలా సహజమైందని అందరూ గుర్తించాలని, పోర్న్ వీడియోలు చూస్తే క్రైమ్ రేట్ పెరుగుతుందనటంలో అర్థం లేదని గాయత్రి అభిప్రాయ పడింది. రహస్యం ఏమీ లేనప్పుడు దాని గురించి మాట్లాడటంలో తప్పేంలేదని గాయత్రి అభిప్రాయపడింది.

 

అయితే తరతరాలుగా జరుగుతున్న పరిణామాలన్నీ స్త్రీలను అణచివేసే పురుషాధిక్య కుట్రలో భాగంగా జరుగుతున్నవే తప్ప స్త్రీలకు స్వేచ్ఛ కలిగించేలా ప్రయత్నాలేవీ జరగట్లేదంది. వర్మ తన జీఎస్టీలో స్త్రీ స్వేచ్ఛ అవసరాన్ని విప్పిచెప్పారని దాన్ని చూసి సరైన విజ్ఞానం పొందాలే తప్ప మరోలా ఆలోచించొద్దని గాయత్రి అభిప్రాయ పడింది. అసలు పరిణామ క్రమంలో మనం బట్టలు వేసుకుంటున్నది కేవలం ప్రకృతి నుంచి శరీరానికి జరిగే హాని నుండి రక్షణ పొందేందుకే తప్ప, నగ్నంగా వుండకూడదని బట్టలు రూపొందించుకోలేదని గాయత్రి అంది. అసలు రామ్ గోపాల్ వర్మ జీఎస్టీలో స్త్రీని సెలెబ్రేట్ చేస్తున్నారు తప్ప హింసకు, కించపరచటానికి తావులేదని గాయత్రి అంది. తాను జీఎస్టీకి ఖచ్చితంగా మద్దతిస్తానని గాయత్రి స్పష్టం చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios