టీవి 9 న్యూస్ రిపోర్టర్, ప్రెజెంటర్ దేవి నాగవల్లి అందరికీ సుపరిచితురాలే. చాలా కాలంగా ఆమె జర్నలిజంలో ఉన్నారు. స్ట్రాంగ్ విమెన్ గా పేరున్న దేవి నాగవల్లి బిగ్ బాస్ సీజన్ 3లో అవకాశం దక్కించుకున్నారు. కింగ్ నాగార్జున హోస్ట్ గా మూడు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ హౌస్ లో దేవి నాగవల్లి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉన్నారు. బిగ్ బాస్ లో పాల్గొన్న తరువాత దేవి నాగవల్లికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. 

దేవి నాగవల్లి లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణరావుకు మనవరాలు వరుస అవుతారట. దేవి నాన్నగారికి దాసరి నారాయణరావు స్వయానా మేనమామ అవుతారట. అలా దేవి నాగవల్లి కుటుంబానికి, దాసరి కుటుంబానికి మధ్య రక్త సంబంధం ఉందట. అప్పట్లో రాజమండ్రి వచ్చిన ప్రతిసారి దాసరి దేవి నాగవల్లి వాళ్ళ ఇంటికి వచ్చేవాడట. ఈ విషయాలన్నీ దేవి తల్లిగారైనా సత్యవతి తాజా ఇంటర్వ్యూ లో తెలియజేశారు. 

మొదటి నుండి దేవి చాలా స్ట్రాంగ్ అమ్మాయి అని ఆమె చెప్పారు. క్రికెట్ తోపాటు అనేక స్పోర్ట్స్ ఆడేవారట. ఇక చదువుల్లో, ఆటల్లో అన్నింటిలో దేవి ప్రధమ స్థానంలో ఉండేవారట.బిగ్ బాస్ సీజన్ 3లోనే పాల్గొనమన్నారట నిర్వాహకులు.  ఖచ్చితంగా మాట్లాడే దేవి బిగ్ బాస్ బాగా ఆడుతుందని, టైటిల్ గెలుస్తుందని నమ్మకం ఉందని సత్యవతి తెలిపారు. ఇక ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్స్ లిస్ట్ లో దేవి నాగవల్లి కూడా ఉన్నారు. మొత్తం ఏడుగురు సభ్యులు ఈ వారానికి ఎలిమినేషన్ లిస్ట్ లోకి చేరడం జరిగింది.