కొద్దిరోజుల క్రితం విడుదలైన 'ఫలక్ నుమా దాస్' టీజర్ ప్రేక్షకులపై ఇంపాక్ట్ చూపించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. సీనియర్ హీరో వెంకటేష్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదలైంది.

చిన్నప్పటినుండే గ్యాంగ్ వార్ పై ఇష్టం పెంచుకున్న దాస్ అనే కుర్రాడు ఫలక్ నుమాలో లీడర్ గా ఎదగాలని ప్రయత్నిస్తుంటాడు. దూకుడుగా వ్యవహరిస్తూ గల్లీలో మటన్ బిజినెస్ మొదలుపెడతాడు.

ఈ క్రమంలో అపోజిషన్ వాళ్లతో గొడవలు, మధ్యలో దాస్ ప్రేమ కథతో ట్రైలర్ ని కట్ చేశారు. ఒకట్రెండు చోట్ల ట్రైలర్ లో బూతులు వినిపించాయి. కంటెంట్ బోల్ద్ గా ఉన్నప్పటికీ యూత్ కి బాగానే కనెక్ట్ అవుతుందనిపిస్తుంది. పైగా రియాలిటీకి దగ్గరగా సినిమాను చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన విశ్వక్ సేన్ దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థతో పాటు మూడు బ్యానర్లు కలిసి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాయి.