‘ఎఫ్3’తో దర్శకుడు అనిల్ రావిపూడి పేల్చిన ఫన్ బాంబ్ బాక్సాఫీసు వద్ద చాలా ప్రభావం చూపిస్తోంది. ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుని, రెండో వారం ప్రారంభం కాగానే ‘సమర్ సోగ్గాళ్లు’ రూ.100 క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తొమ్మిది రోజుల కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
విక్టరీ వెంకటేష్ (Venkatesh), వరుణ్ తేజ్(Varun Tej) కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం `ఎఫ్3`(F3). గత నెల మే 27న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అయిన ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. కరోనా పాండమిక్ తర్వాత అన్నీ సినిమాలు యాక్షన్ తో కూడుకున్నవ అవడంతో ఆడియెన్స్ కు ఫన్ మిస్ అయ్యింది. దీన్ని గుర్తించి అనిల్ రావిపూడి ‘ఎఫ్3’తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. అదే విధంగా బాక్సాఫీసు వద్ద ‘సమ్మర్ సోగ్గాళ్లు’ కాసుల వర్షం కురిపిస్తున్నాడు. మిగితా సినిమాలతో పోల్చి చూస్తే ‘ఎఫ్3’ కాస్తా కలెక్షన్స్ లో వీక్ గా ఉన్నా.. ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ కావడంతో ఇంకా కౌంటింగ్ జోరుగా కొనసాగుతోంది.
ఈ చిత్రం తాజాగా కలెక్షన్స్ లో ఓ అడుగు ముందుకు వేసింది. సూపర్ కలెక్షన్స్ తో కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంకా సినిమాకు ఆదరణ పెరుగుతూనే ఉంది. బాక్సాఫీస్ వద్ద ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు మంచి డిమాండ్ ఉందనే చెప్పాలి. తొలుత చిత్రం రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.73 కోట్ల గ్రాస్ వసూళ్ చేసిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.102 కోట్ల వసూళ్లతో రూ. 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వడం పట్ల మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో చిత్రం ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తోంది.
ఎఫ్3 డే1 నుంచి డే9 వరకు కలెక్షన్స్ వివరాలను పరిశీలిస్తే..
తొలి రోజు షేర్ రూ. 13.65Cr(23.55Cr+గ్రాస్),
రెండో రోజు షేర్ – 9.85Cr(16.25cr~ గ్రాస్),
3వ రోజు షేర్ – 11.05Cr(18.25cr~ గ్రాస్)
4వ రోజు షేర్ – 5.40Cr(8.65cr~ గ్రాస్)
5వ రోజు షేర్ – 3.86Cr(6.30cr~ గ్రాస్)
6వ రోజు షేర్ – 2.59Cr(4.35cr~ గ్రాస్)
7వ రోజు షేర్ – 1.77Cr(3.15cr~ గ్రాస్)
8వ రోజు షేర్ – 0.84Cr(1.70cr~ గ్రాస్)
9వ రోజు షేర్ – 2.02Cr(2.78cr~ గ్రాస్) గా ఉంది.
కాగా తాజాగా అందించిన సమాచారం ప్రకారం.. పదో రోజు కలెక్షన్స్ తో ఎఫ్3 ఇకపై లాభాల బాటలో పయనించనుంది. ఈ చిత్రంలో తమన్నా(Tamannaah), మెహరీన్, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, శిరీష్‌తో కలిసి దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. మూడేళ్ల కింద వచ్చిన `ఎఫ్2`కి ఇది సీక్వెల్. ప్రస్తుతం సెకండ్ వీక్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఎఫ్3 గ్రాడ్యువల్ గా వసూళ్లను రాబడుతోంది.
