Asianet News TeluguAsianet News Telugu

అడల్ట్ కామెడీ:‘ఏక్ మినీ కథ’ రివ్యూ

కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ.. వరుస విజయాలు అందుకుంటున్న నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్. దీనికి అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మొదలు పెట్టారు. ఈ బ్యాన‌ర్ లోనే ఏక్ మినీ కథ సినిమా తీసి రిలీజ్ చేసారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించటంతో మరింత క్రేజ్ వచ్చింది.

Ek Mini Katha telugu movie Review jsp
Author
Hyderabad, First Published May 27, 2021, 9:20 AM IST

ఒక తరంవాళ్లకి స్వాతి వార పత్రికలో వచ్చే సుఖ సంసారం శీర్షిక బాగా పరిచయం. అందులో డాక్టర్ సమరం గారు లైంగిక విజ్ఞానానికి సంభందించి అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చేవారు. ఇప్పుడంటే ఎన్నో సైట్లు కామశాస్త్రాన్ని పరిచయం చేయటానికి పోటీ పడుతున్నాయి కానీ అప్పటి యూత్ కు అదే నాలెడ్జ్ బ్యాంక్. ఆ ప్రశ్నల్లో ఎక్కువగా సైజు గురించిన ప్రశ్నలు,సమాధానాలే ఉండేవి. అలాంటి ఓ ప్రశ్నలోంచి పుట్టిన కథగా చెప్పబడుతున్న ఈ సినిమా ఈ రోజు ఓటీటిలో రిలీజైంది.  ప్రమోషన్స్ తో జనాల అటెన్షన్ బాగానే గ్రాబ్ చేసిన ఈ సినిమా  ఏ మేరకు కామన్ ప్రేక్షకుడుని ఆకట్టుకుంటుంది. అసలు ఆ సైజ్ మ్యాటర్ కథేంటి, ఫ్యామిలీలతో చూడదగ్గ సినిమాయేనా,పేపర్ బోయ్ తో పరిచయం అయిన సంతోష్ ఈ సినిమాతో హిట్ కొట్టి బిజీ అవుతాడా? వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి

సివిల్ ఇంజినీరు సంతోష్ (సంతోష్ శోభ‌న్‌)కు చిన్నప్పటినుంచీ సమస్య వేధింస్తూంటుంది.  తన ప్రెవేట్ పార్ట్ సైజ్ చిన్నది అని ఎప్పుడూ మధనపడుతూ అదే ఆలోచనలో ఉంటూంటాడు. తను పెళ్లికి పనికిరానేమో, ఒక వేళ పెళ్లైతే తన భార్య వదిలేస్తుందేమో అని అనుకుంటూంటాడు. ఈ ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ కు ఆది,అంతం ఉండదు. దాన్ని దాటటం కోసం `సైజ్‌`పెంచుకునే దిసగా రకరకాల ప్రయత్నాలు చేస్తూంటాడు. ఎవరే చిట్కా చెప్పినా పాటిస్తూంటాడు. ఫేస్ బుక్ లో తనలాంటివాళ్లు పెట్టుకున్న గ్రూప్ లలో జాయిన్ అయ్యి రెగ్యులర్ గా అక్కడ చెప్పే టిప్స్ ని పాటిస్తూంటాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రెండ్ తనకు తెలిసిన డాక్టర్ (పోసాని)ఇలా సైజ్ పెంచటానికి ఆపరేషన్ చేస్తాడని తెలుసుకుని డబ్బుకూడా రెడీ చేసుకుంటాడు. కానీ లాస్ట్ మినిట్ లో ఆపరేషన్ జరగదు. ఈ లోగా అమృత (కావ్య థాప‌ర్‌)తో పెళ్లి చూపులు, పెళ్లి సెట్ అవుతాయి. ఆమె సంతోష్ కు రివర్స్. తన జీవితంలో ప్రతీది పెద్దగా ఉండాలనుకుంటుంది. పెద్ద కలలే కంటూంటుంది. ఇవి చూసి అమృతని ఎవాయిడ్ చేద్దామని మొదట అనుకుంటాడు సంతోష్. కానీ ఆమెతో ప్రేమలో పడిపోవటంతో పెళ్లిని వాయిదా వేద్దామనుకుంటాడు. కానీ ఆ పెళ్లి జరిగిపోతుంది. ఇప్పుడు అతని ముందు ఉన్న పెద్ద సమస్య శోభనం. ఆ టైమ్ లో తన సైజ్ మ్యాటర్ బయిటపడిపోతుందేమో అనే భయం. దాన్ని సంతోష్ అధిగమించగలిగాడా...చివరకు ఏమైంది..ఈ కథలో శ్రద్దాదాస్ పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


విశ్లేషణ

ఇలాంటి పాయింట్ తో  90వ దశకంలో  కన్నడ నటుడు,దర్శకుడు కాశీనాధ్  సినిమాలు చేసారు. అనుభవం, వింత శోభనం, పొగరుబోతు పెళ్లం, సుందరాంగుడు వంటి సినిమాలు తెలుగులోనూ పెద్ద హిట్ అయ్యాయి. ముఖ్యంగా అనుభవం, వింత శోభనం అడల్ట్ కామెడీలే అయినా సెక్స్ ఎడ్యుకేషన్ ఫిల్మ్స్ అని చెప్పాలి. ఆ తర్వాత తమపై అడల్ట్ ముద్ర పడుతుందని ఆ తరహా సినిమాలకు దర్శకులు దూరం ఉండిపోయారు.అయితే ఇప్పుడు మారుతున్న కాలమాన పరిస్దితుల్లో ఈ సినిమా మళ్లీ పురుడుపోసుకుంది. ఇలాంటి ఫ్రెష్ థాట్స్ తో కూడిన కాన్సెప్టు సినిమాలు చాలా రావాల్సి ఉంది. వాస్తవానికి ఇలాంటి సబ్జెక్టు మీద కథ రాసి,ఒప్పించటం అనేది చాలా కష్టం. ప్రతీ దశలోనూ ఇలాంటి పాయింట్ లను జనం చూస్తారా..ఆదరిస్తారా అనే సందేహం పీకుతూంటుంది. అయితే అడల్ట్ కంటెంట్ ని హద్దు దాటకుండా కామెడీతో లాక్కువెళ్లే ప్రయత్నం చేసారు దర్శక,రచయితలు. అందుకు ఇద్దరినీ అభినందించాలి.  వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ అందించిన కథ కొత్త తరానికి పనికొచ్చేదే.

 అయితే ఈ సినిమా కు తీసుకున్న స్టోరీ లైన్ బాగా థిన్ గా ఉండటంతో ట్రీట్మెంట్ ఇంకా బాగా చెయ్యాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా డ్రామా పండలేదు. ఫస్టాఫ్ ఫన్ తో బాగుందనిపించుకున్నా కానీ సెకండాఫ్ లో కథ పెద్దగా లేకపోవటంతో ప్రక్క ట్రాకులు వేసి  బాగా సాగతీసారు. అలాగే ట్రైలర్స్, టీజర్స్ ద్వారా సాధారణ ప్రేక్షకుడుకి కూడా ఈ సినిమా కాన్సెప్టు ఫలానా అని అర్దమైపోయింది. అలాంటప్పుడు కథలో మెయిన్ పాయింట్ అయిన సైజ్ మ్యాటర్ గురించి చెప్పటానికి ఎందుకు అంత లేటు చేసారో అర్దం కాదు. ఈ తరహా సినిమా గంటన్నరలో తెమిలిపోవాలి. అంతేకానీ రెండు గంటలు దాటించాలని తాపత్రయం పెట్టుకుంటే ఇలాగే సాగతీయాల్సి వస్తుంది. సైజ్ మ్యాటర్ కథలో అనుమానాలు,అపార్డాలు వంటివి కూడా లాక్కురావాల్సి వచ్చింది. దాంతో బోర్ ని పనిగట్టుకుని ఆహ్వానించినట్లైంది. అయినా బిగ్ కి, లార్జ్ కు తేడా తెలియకుండా సీన్స్ నడుస్తూండటం ఆశ్చర్యం వేస్తుంది. అలాగే చాలా చోట్ల ఎమోషన్ పండాల్సిన చోట కూడా అనవసరంగా కామెడీ చేసేసారు. దాంతో సినిమాకు రావాల్సిన ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మిస్సైంది. హీరో మీద సానుభూతి రాకముందే సినిమా పూర్తై పోయింది.  

ఎవరెలా చేసారు

  పేపర్ బాయ్ సినిమాతో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. సంతోష్ తన పాత్రకు దాదాపు ప్రాణం పోసాడనే చెప్పాలి. ఆత్మ నూన్యతా భావంతో బాధపడే కుర్రాడిగా చాలా చోట్ల తన ఎక్సప్రెషన్స్ తో  నవ్విస్తాడు.అదే సమయంలో తన అనుమానాలతో తనే మౌనంగా సతమతమయ్యిపోయే మిడిల్ క్లాస్ కుర్రాడుగా బాగా చేసారు. హీరోయిన్ కావ్య థాప‌ర్ కు ఈ సినిమా అంత సీన్ లేదు. అయినా ఉన్న మేరకు ఓకే అనిపిస్తుంది. ఎప్పటిలాగే సుద‌ర్శ‌న్ న‌వ్విస్తాడు. సినిమా అంతా హీరోతో పాటు ఉంటూ బోర్ ని తప్పించే ప్రయత్నం చేస్తాడు. సంతోష్ తండ్రిగా బ్ర‌హ్మాజీ ఎప్పటిలాగే బాగా చేసారు. శ్ర‌ద్ధాదాస్ క్యారక్టర్ ఇంపాక్ట్ లేదు. హర్షవర్ధన్ లు తమ పాత్రలకి న్యాయం చేసారు. కానీ కమిడియన్ గా సప్తగిరి పాత్ర అసలు నవ్వించలేకపోయింది.

టెక్నికల్ గా ..

 సంతోష్, సుదర్శన్ మధ్య వచ్చే సీన్స్, వన్ లైనర్ పంచ్ డైలాగ్స్ ఫన్నీగా బాగున్నాయి.  సినిమాటోగ్రాఫర్ గోకుల్ భారతి వర్క్ బాగుంది. ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ కూడా వినగా వినగా పట్టేటట్లు ఉంది. పెద్ద తెరపై అది బాగా ఎలివేట్ అయ్యేది. రవీందర్ ఆర్ట్ వర్క్ నెక్ట్స్ లెవిల్ లో ఉంది. చిన్న సినిమాకు పెద్ద లుక్ వచ్చింది. సత్య జి ఎడిటింగ్ బాగున్నా..ఇంకాసిని సీన్స్ లేపేయచ్చేమో అనిపించింది.ముఖ్యంగా లెంగ్త్ తగ్గించి ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.

ఫైనల్ థాట్

డైరక్టర్ కూడా సినిమా సక్సెస్ కు సైజ్ (లెంగ్త్) మ్యాటరే కాదని తెలుసుకోవాలి.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.5


తెర వెనుక..ముందు

బ్యానర్: యూవీ కాన్సెప్ట్స్
నటీనటులు: సంతోష్ శోభన్, కావ్య తప్పర్, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు..
కథ: మేర్లపాక గాంధీ
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి
ఎడిటర్: సత్య
దర్శకుడు: కార్తీక్ రాపోలు
ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్
రన్ టైమ్:2 గంటల 14 నిమిషాలు
ఓటీటి: అమెజాన్ ప్రైమ్ 
విడుదల తేదీ :మే 27, 2021
  

Follow Us:
Download App:
  • android
  • ios