ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫోటోస్‌తో నెటిజన్లకి, సోషల్‌ మీడియా అభిమానులను అలరిస్తున్న ఈషా రెబ్బా చివరగా గతేడాది `రాగల 24గంటల్లో` చిత్రంలో మెరిసింది. 

అందం, అభినయం మేళవించిన ఈషా రెబ్బా ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడంలో ఒక్కో సినిమా చేస్తూ బిజీగా ఉంది. తెలుగులో `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌`లో ఓ హీరోయిన్‌గా మెవరగా, తమిళంలో `ఆయిరమ్‌ జెన్మంగల్‌`లో, అలాగే కన్నడలోకి ఎంట్రీ ఇస్తూ శివరాజ్‌కుమార్‌తో ఓ సినిమా చేస్తుంది.

ఇదిలా ఉంటే లాక్‌డౌన్‌ టైమ్‌ ఇంట్లోనే గడిపిన ఈ అమ్మడు తాజాగా వర్కౌట్‌ వీడియోని పంచుకుంది. జిమ్‌లో వర్కౌట్‌ చేస్తూ అదరగొట్టింది. సెక్సీ వర్కౌట్‌తో తన స్టామినా చాటుకుంది. ఈషాలో ఇంత స్టామినా ఉందా? అని ఆశ్చర్యపోయేలా చేసిందీ హాట్‌ తెలుగు హీరోయిన్‌. ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. 

View this post on Instagram

Stronger with every Step!💪🏻🤟🏻

A post shared by Eesha Rebba (@yourseesha) on Oct 12, 2020 at 4:20am PDT