Asianet News TeluguAsianet News Telugu

డ్రగ్స్ కేసు: స్టార్ యాంకర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు...!


మంగుళూరు సీసీబీ పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో అనుశ్రీ పేరును పేర్కొనడం సంచలనంగా మారింది.  అనుశ్రీ డ్రగ్స్‌ను అమ్మడంతో పాటు రూంకు తెచ్చేవారని ఆమె స్నేహితుడు కిశోర్‌ అమన్‌ శెట్టి చెప్పినట్లు తెలిపారు. 

drugs case ccb officials mentions anchor anushree name in latest charge sheet
Author
Hyderabad, First Published Sep 9, 2021, 8:07 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

గత సంవత్సరం శాండిల్ వుడ్ పరిశ్రమలో డ్రగ్స్ కేసు సంచలనం రేపింది. డ్రగ్స్ ఆరోపణలపై పలువురు అరెస్ట్ కాగా, వారిలో టెలివిజన్, సినిమా ప్రముఖులు ఉన్నారు. డ్రగ్స్ కేసు సీరియస్ గా తీసుకున్న అధికారులు ఆధారాలు సేకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో హీరోయిన్స్ సంజనా గల్రాని, రాగిణి ద్వివేదిలను అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే యాంకర్ నటి అనుశ్రీని కూడా పోలీసులు విచారించారు. 


తాజాగా మంగుళూరు సీసీబీ పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో ఆమె పేరును పేర్కొనడం సంచలనంగా మారింది.  అనుశ్రీ డ్రగ్స్‌ను అమ్మడంతో పాటు రూంకు తెచ్చేవారని ఆమె స్నేహితుడు కిశోర్‌ అమన్‌ శెట్టి చెప్పినట్లు తెలిపారు. తరుణ్, అనుశ్రీలు డ్రగ్స్‌ పార్టీలకు వెళ్లడంతో పాటు రూంకు తీసుకొచ్చేవారు. అనుశ్రీ బెంగళూరులో నృత్య సాధన చేస్తున్న సమయంలో డ్రగ్స్‌ సేవిస్తే ఖుషీగా డ్యాన్స్‌ చేయవచ్చని తోటివారితో చెప్పేది. అనుశ్రీ రియాలిటీ షోలో గెలిచిన సమయంలో తరుణ్‌ డ్రగ్స్‌ పార్టీ ఇచ్చాడని సమాచారం. 

మరోవైపు తాను నిరపరాధిని అంటూ అనుశ్రీ ఒక వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. నేను బెంగళూరుకు 14 ఏళ్ల క్రితం బస్సులో వచ్చి చేరుకున్నా. సుమారు 12 ఏళ్ల కాలం పాటు హాస్టల్‌లో ఉన్నాను. ఆ తర్వాత నాటక రంగంలో ఆఫర్లు వచ్చాయి. నేను మంచిగా ఉన్నాను, కనుకనే ఇంత పెద్ద స్థాయికి ఎదిగాను. అయితే డ్రగ్స్‌ కేసులో విచారణ ఎదుర్కొనడం బాధిస్తుందని అనుశ్రీ ఆవేదన చెందారు. 

మరోవైపు టాలీవుడ్ ప్రముఖులపై డ్రగ్స్ విచారణ కొనసాగుతుంది. పది మంది సినీ ప్రముఖులతో పాటు, మొత్తం 12మందికి ఈడీ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. దర్శకుడు పూరి జగన్నాధ్, ఛార్మి, రకుల్, రానా, నందు విచారణలో పాల్గొనగా, రవితేజ, తరుణ్ వంటి స్టార్స్ విచారణ ఎదుర్కోవాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios