బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు సంచలనం రేపగా అది కన్నడ పరిశ్రమ వరకు పాకింది. వెండితెర, బుల్లితెర పరిశ్రమలకు చెందిన కొందరు ప్రముఖులు డ్రగ్స్ దందా నడుపుతున్నారని, డ్రగ్ మాఫియాతో సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో కొందరు నటులు అరెస్ట్ కాబడ్డారు. వారిలో సంజనా గల్రాని, రాగిణి ద్వివేది పేర్లు ప్రముఖంగా వినిపించాయి. డ్రగ్స్ ఆరోపణలపై అరెస్ట్ కాబడ్డ ఈ ఇద్దరు హీరోయిన్స్ జైలు జీవితం గడిపారు. 

కొద్దిరోజుల క్రితం బైలుపై బయటికి వచ్చిన సంజనా తన జీవితంలో జరిగిన చేదు అనుభవాల గురించి పెదవి విప్పారు. జీవితం మొత్తం గతుకుల రోడ్డులా తయారైందని, అయినప్పటికీ ఓపికతో సాధారణ స్థితికి రావడానికి ప్రయత్నిస్తున్నా అన్నారు. తనపై ఆరోపణలకు కాలమే సమాధానం చెబుతుందని, ఒక దశలో ఇన్ని కష్టాలు పెట్టే కంటే ఒకేసారి చంపెయ్యొచ్చు కదా దేవుడా... అని అనిపించేదని సంజనా ఆవేదన చెందారు. 

అయితే లాక్ డౌన్ సమయంలో తనకు ఓ వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరిగిందని, త్వరలో నిరాడంబరంగా పెళ్లి చేసుకుంటానని చెప్పి బాంబు పేల్చింది. ఇంత వరకు సంజనా గల్రానికి ఎంగేజ్మెంట్ జరిగిన విషయం ఎవరీ తెలియదు. ఇక సంజనాను పెళ్లి చేసుకోబోయే ఆ వ్యక్తి ఎవరు అనే విషయం ఆమె తెలియజేయలేదు.