పుట్టిన రోజు పూట హీరోలు తమ అభిమానులను అలరించటానికి కొత్త చిత్రాలు ఎనౌన్స్ చేయటం ఆనవాయితీ. ఈ రోజు మోహన్‌లాల్ 60వ బర్త్ డేను  జరుపుకుంటున్నారు. ఈ  సందర్భంగా ఆయన సూపర్ హిట్ సినిమా దృశ్యం సీక్వెల్ తీయనున్నట్లు ప్రకటన చేసి అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. ఈ సినిమాకి సంభందించిన ఇరవై సెకన్ల టీజర్ ని సైతం విడుదల చేసారు.

జార్జ్ కుట్టీ క్యారెక్టర్ లో ఉన్న మోహన్‌లాల్ స్లోగా కళ్లు తెరుస్తారు ఇదే టీజర్. ఆంటోనీ పెరుంబవూర్ దీనికి నిర్మాణ బాధ్యతలు వహించనున్నారు. ఈ టీజర్ రిలీజ్ చేస్తూ.. #Drishyam #Drishyam 2 (sic)." అంటూ హ్యాష్ ట్యాగ్‌లు పెట్టారు.  సినిమా ఫస్ట్ పార్ట్ లో మోహన్ లాల్ క్యారెక్టర్ జార్జి కుట్టీ జీవితాన్నే ఇందులోనూ కొనసాగించనున్నారు. మలయాళ థ్రిల్లర్ రామ్ కోసం మోహన్ లాల్, జీతు జోసెఫ్ ఇటీవల చేతులు కలిపారు. త్రిష కృష్ణన్ హీరోయిన్ నటించిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు నిలిపివేయబడింది. ఇప్పుడు ఆ స్థానంలో దృశ్యం 2 ను తీస్తున్నారు.


  https://twitter.com/Mohanlal/status/1263379181032726529


2013లో రిలీజ్ అయిన దృశ్యం చిత్రం సూపర్ హిట్ అయింది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.50కోట్లకు పైగా వసూలు చేసిన తొలి సినిమాగా ఘనత సాధించింది.   సెల్ఫ్ డిఫెన్స్‌లో భాగంగా తన కూతురు చేసిన మర్డర్ ను తెలివిగా తప్పిస్తాడు. అతను తప్ప వేరెవ్వరికీ తెలియకుండా ఆ శవం మాయం చేస్తాడు. ఈ సినిమాలో మోహన్ లాల్ కు జోడీగా మీనా నటించింది. తెలుగులో ఈ సినిమాని వెంకటేష్ చేసారు. హిందీ,తమిళ భాషల్లో సైతం ఈ సినిమా రీమేక్ అయ్యి ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంలో ఈ సినిమాపై అందరి దృష్టీ పెడింది. 

ఇక దృశ్యం-2సినిమా షూటింగ్ ను కేరళ ప్రభుత్వం సినిమా షూటింగ్ కు ఓకే చెప్పినప్పుడు ప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు.. మిగిలిన నటీనటులను గురించి పూర్తి వివరాలు ప్రకటిస్తామని వెల్లడించారు.  ఈ సీక్వెల్ ప్రాజెక్టు కూడా మొదటి భాగం లాగే సక్సెస్ అవుతుందేమో చూడాలి. మోహన్ లాల్ చివరి సారిగా గాడ్ ఫాదర్ అనే సినిమాలో కనిపించారు.