ఇటీవల వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ జబర్దస్త్ యాక్టర్ దొరబాబుపై అనేక రకాల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కెరీర్ మొదట్లో బీ గ్రేట్ షార్ట్ ఫిలిమ్స్ తో ఒక రకమైన నెగిటివ్ టాక్ ను జబర్దస్త్ ద్వారా పోగొట్టుకున్న దొరబాబు పోలీసులకు దొరికి మరొక మాయని మచ్చను తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతనిని తిట్టని వారు లేరు. అందమైన కుటుంబంతో సంతోషంగా గడపకా ఇలాంటి దిక్కుమాలిన పనులేంటని కామెంట్ చేస్తున్నారు.

అయితే ఎవరు ఎన్ని తిట్టినా దొరబాబు భార్య మాత్రం అతినిపై నమ్మకాన్ని కోల్పోలేనట్లు సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేస్తోంది. దొరబాబు నెల్లూరుకు చెందిన అమూల్య ని 2018లో పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఇంతకుముందు ఒక ఛానెల్ లో యాంకర్ గా పనిచేసింది. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దొరబాబు భార్యకు టిక్ టాక్ లో ఫాలోవర్స్ కూడా గట్టిగానే ఉన్నారు. ఇక వీరికి ఒక కూతురు కూడా ఉంది.

ఇటీవల పాప మొదటి బర్త్ డే ను గ్రాండ్ గా నిర్వహించారు. అయితే అంతా హ్యాపీగా ఉన్న సమయంలో దొరబాబు పాడుపని చేస్తూ దొరకడం వారి కుటుంబాన్ని ఎంతో బాధించి ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే రీసెంట్ గా ఆమె టిక్ టాక్ లో చేసిన ఒక పోస్ట్ తో తన భర్త మీద ఉన్న అభిప్రాయాన్ని చెప్పేసింది. "ఓ వ్యక్తిని అపార్థం చేసుకునేటప్పుడు గతంలో ఆయన మనతో ఎలా ఉన్నాడనేది మరిచిపోకూడదు.. కొన్నిసార్లు మన కళ్లను మనమే నమ్మలేం.. అవి కూడా మనను మోసం చేస్తుంటాయి..నామొగుడు ఎలాంటి వాడో తనకు తెలుసు." అని అమూల్య పేర్కొన్న విధానం నెటిజన్స్ ని షాక్ కి గురిచేసింది.

అంటే అమూల్యకు దొరబాబు అంటే ఎంత ఇష్టమనేది ఇక్కడే అర్ధమవుతోంది. దొరబాబు ఎలాంటివాడో ఆమెకు ముందు నుంచే తెలుసు. అయినప్పటికీ ఏ మాత్రం సందేహించకుండా ప్రేమించి పెళ్లి చేసుకుంది అంటే అతని గుణం ఎలాంటిదో అర్ధం చేసుకోండని దొరబాబు సన్నిహితులు కామెంట్ చేస్తున్నారు.