Asianet News TeluguAsianet News Telugu

గుడ్‌న్యూస్‌ : రేపటి నుంచి 'శ్రీకృష్ణ'

 రామాయణం, మహాభారతాలను దూరదర్శన్ పున:ప్రసారం చేస్తోన్న నేపథ్యంలో దూరదర్శన్ ఛానెల్‌ టీఆర్‌పీ అమాంతం పెరిగిపోవటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మరో ఇతిహాస కావ్యం శ్రీకృష్ణ సీరియల్‌ను ఆ ఛానెల్ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.

Doordarshan To Re-Telecast Ramanand Sagar's Shri Krishna
Author
Hyderabad, First Published May 2, 2020, 12:27 PM IST


రామాయణం, మహాభారతం వంటి సీరియళ్లను ఇప్పటికే పునఃప్రసారం చేస్తోన్న డీడీ నేషనల్ ఇప్పుడు శ్రీకృష్ణను కూడా ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకుంది.  రామాయణం, మహాభారతాలను దూరదర్శన్ పున:ప్రసారం చేస్తోన్న నేపథ్యంలో దూరదర్శన్ ఛానెల్‌ టీఆర్‌పీ అమాంతం పెరిగిపోవటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మరో ఇతిహాస కావ్యం శ్రీకృష్ణ సీరియల్‌ను ఆ ఛానెల్ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఈ సీరియల్‌ రేపటి నుంచే ప్రసారమవుతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ రోజు ప్రకటించారు.

'డీడీ నేషనల్‌లో ప్రసారమైన పాప్యులర్ సీరియళ్లలో ఒకటైన శ్రీకృష్ణను రేపటి నుంచి ప్రతి రోజు రాత్రి 9 గంటలకు ప్రసారం చేస్తున్నాం' అని జవదేకర్ ట్విట్టర్‌లో వెల్లడించారు. కాగా,రామానంద సాగర్ దర్శకత్వం వహించిన శ్రీకృష్ణ 1993 నుంచి 1996 వరకు దూరదర్శన్‌లో ప్రసారమైంది. ఆ తరువాత 1999లో జీ టీవీలో, అనంతరం 2001 లో సోనీ, స్టార్ వంటి చానెళ్లలోనూ ఈ సీరియల్ ప్రసారమైంది.   శ్రీకృష్ణ జననం, కంస వధ, మహాభారత గాథ వగైరా ఘట్టాలన్నీ ఈ ధారావాహికలో అలరించనున్నాయి. 

ఇక  ‘బార్క్‌(బ్రాడ్‌కాస్ట్‌ ఆడియన్స్‌ రిసెర్చ్‌ కౌన్సిల్‌) ఇండియా’ వారి లెక్కల ప్రకారం మార్చి నెలాఖరు నుంచి ఇప్పటి దాకా వరుసగా మూడు వారాలుగా వీక్షకాదరణలో ‘దూరదర్శన్‌ (డి.డి) నేషనల్‌’ ఛానల్‌ నంబర్‌ వన్‌ స్థానంలో నిలుస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios