Asianet News TeluguAsianet News Telugu

దావూద్‌ గ్యాంగ్‌తో బాలీవుడ్‌ స్టార్‌ హీరోకి సంబంధాలున్నాయా?

తాజాగా దావూద్‌ గ్యాంగ్‌తో అక్షయ్‌ కుమార్‌ దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

does bollywood star akshay kumar have any connection with dawood gang?
Author
Hyderabad, First Published Sep 12, 2020, 9:42 AM IST

అండర్‌ వరల్డ్ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు, బాలీవుడ్‌కి సంబంధాలున్నాయని అనేక సందర్భాల్లో ఆరోపణలు వస్తున్నాయి. బాలీవుడ్‌ డ్రగ్‌ మాఫియాకి, దావూద్‌కి రహస్య సంబంధాలున్నాయనే టాక్‌ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో సంచలన వార్త బయటకొస్తుంది. బాలీవుడ్‌ సునామి అక్షయ్‌ కుమార్‌ పేరు వినిపిస్తుంది. 

తాజాగా దావూద్‌ గ్యాంగ్‌తో అక్షయ్‌ కుమార్‌ దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. అంతేకాదు అక్షయ్‌ కుమార్‌ వ్యక్తిగత లాయర్‌ విబోర్‌ ఆనంద్‌.. అక్షయ్‌ కుమార్‌ `డి`గ్యాంగ్‌తో సంబంధాలున్నాయని ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. 

 `అక్షయ్‌ కుమార్‌ ఎందుకు వాళ్లని కలిశాడు? పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ ఏజెంట్స్ తో అక్షయ్‌ కుమార్‌ పనేంటి? అంటూ విబోర్‌  ప్రశ్నల వర్షం కురిపించారు. మరోవైపు ఆ గ్యాంగ్‌తో అక్షయ్‌ దిగిన ఫోటోలో వైరల్‌ కావడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద స్టార్‌ అయ్యుండి వారితో ఫోటో దిగడమేంటి? వాళ్ళతో తిరగడమేంటని ప్రశ్నిస్తున్నారు. మరి ఇందులో నిలమెంతా? అనేది తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios