బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఇంటిలో ముందే దివాళి సందడి మొదలైంది. తన మిత్రులతో పాటు పుట్టింటిలో కరీనా దివాళి వేడుకలు పరుపుకుంటున్నారు. పేరెంట్స్, ఫ్రెండ్స్ తో కరీనా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. 

కరీనా కపూర్ ప్రస్తుతం గర్భవతి. 2016లో కరీనా మొదట సంతానంగా మగబిడ్డకు జన్మనిచ్చారు. కరీనా కొడుకు తైమూర్ కి ప్రస్తుతం నాలుగేళ్లు. నాలుగేళ్ళ తర్వాత కరీనా మరలా గర్భం దాల్చారు. ఇక మరో కొద్దిరోజులలో దివాళి కావడంతో కరీనా తల్లి బబితా కపూర్ ని కలిశారు. కరీనా ఫ్రెండ్ ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్త, మేనేజర్ పూనమ్ దమానియా కూడా ఈ వేడుకలో పాల్గొనడం జరిగింది. 

వీరందరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతున్నాయి. కరీనా కపూర్ భర్త సైఫ్ అలీఖాన్ ఈ వేడుకలో కనిపించకపోవడం విశేషం . సైఫ్ అలీ ఖాన్ ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న ఆదిపురుష్ మూవీలో రావణాసురిడి పాత్ర చేస్తున్నారు. దర్శకుడు ఓం రౌత్ దీనిపై అధికారిక ప్రకటన చేయగా, అందమైన రావణాసురుడు అంటూ కరీనా సోషల్ మీడియాలో స్పందించారు. ప్రస్తుతం కరీనా  లాల్ సింగ్ చద్దా మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.