పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ సినిమాతో వెండితెరకుపరియయం అయిన అందాల భామ దిశ పటాని. సినిమాలో కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువగా పాపులర్‌ అయిన బ్యూటీ తరుచూ ఇన్నర్‌ వేర్‌తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. కాల్విన్ కెయిన్‌కు సంస్థకు ప్రమోటర్‌గా ఉన్న దిశ ఎప్పుడు ఆ కంపెనీ ఇన్నర్‌ వేర్‌లో ఉన్న హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే లాక్‌ డౌన్‌ ప్రకటించిన దగ్గర నుంచి కొద్ది రోజులుగా హాట్ ఫోటోలను షేర్ చేయటం తగ్గించింది. ఈ బ్యూటీ దీంతో నిరాశలో ఉన్న అభిమానులకు షాక్‌ ఇచ్చేలా ఓ ఫోటోను షేర్ చేసింది..

శుక్రవారం దిశ తన సోషల్ మీడియాలో పేజ్‌లో ఓ హాట్‌ ఫోటోను షేర్ చేసింది. ఫ్లోరల్‌ మోనొకినిలో హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తూ బీచ్‌ ఒడ్డున సేద తీరుతున్న తన ఫోటోనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేసింది దిశ పటాని. చాలా రోజులు తరువాత దిశ ఫోస్ట్ చేసిన బికినీ ఫోటో కావటంతో ఈ ఫోటో ఒక్కసారిగా వైరల్‌గా మారింది. ఫోటో పోస్ట్ చేసిన కొద్ది సేపట్లోనే వైరల్‌గా మారింది. ఈ ఫోటో ఎప్పుడు దిగింది, ఎవరు తీశారు లాంటి అంశాలను ప్రస్థావించకపోయినా ఫోటో మాత్రం సూపర్‌  హాట్ గా ఉంది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది ఇప్పటికే మలంగ్, బాగీ 3 సినిమాల్లో కనిపించిన ఈ బ్యూటీ ప్రస్తుతం కే టీనా, రాధే సినిమాల్లో నటిస్తోంది. కే టీనా సినిమాలో టైటిల్‌ రోల్‌లో పోషిస్తుండగా.. రాధే సినిమాలో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌కు జోడిగా నటిస్తోంది. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ బ్యూటీ తన బాయ్‌ ఫ్రెండ్‌ టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి ఉంటుందన్న టాక్ కూడా వినిపిస్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🌸🌊

A post shared by disha patani (paatni) (@dishapatani) on May 22, 2020 at 1:25am PDT