దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న బిగ్ బాస్ షో తెలుగు సీజన్ 3 నేడు ప్రారంభం కాబోతోంది. కింగ్ నాగార్జున ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు షోతో బుల్లి తెరపై తన సత్తా చాటిన నాగ్ బిగ్ బాస్ షోలో హోస్ట్ గా ఎలా మెప్పిస్తాడనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. 

ఇక బిగ్ బాస్ షోపై నెలకొన్న వివాదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. యాంకర్ శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్త బిగ్ బాస్ షో ముసుగులో కో ఆర్డినేటర్లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు అంటూ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఛానల్ డిబేట్ లో శ్వేతా రెడ్డి, బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ సంజన మధ్య మాటల యుద్ధం కొనసాగింది. 

బిగ్ బాస్ షోలో పాల్గొనాలంటే అంత సులువు కాదు. దాదాపు 100 రోజుల పాటు ప్రపంచానికి దూరంగా, కుటుంబ సభ్యులు పక్కన లేకుండా ఉండాలి. దానికి మానసిక స్థైర్యం ఎంతో అవసరం. ఆ క్రమంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కోసం ఇంటర్వ్యూ చేసే సమయంలో వీళ్లకు అంత సహనం ఉందా అని అనేక రకాల ప్రశ్నలు అడుగుతారు. 

ఆ క్రమంలో శ్వేతారెడ్డి తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చని సంజన తెలిపింది. తాను కేవలం బిగ్ బాస్ షోకి 6 రోజుల ముందు ఇంటర్వ్యూకి వెళ్లాను. ఆ ఇంటర్వ్యూలో తనని 170 ప్రశ్నలు అడిగినట్లు సంజన తెలిపింది. బిగ్ బాస్ షోని సంజన సమర్థించడాన్ని శ్వేతా రెడ్డి తప్పు బట్టారు. అది నిజంగా మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయితే సెక్స్ పాఠాలు గురించి ఎందుకు ప్రస్తావిస్తారు.. 100 రోజులు సెక్స్ లేకుండా ఉండగలవా అని ఎందుకు ప్రశ్నిస్తారు అని శ్వేతా రెడ్డి సంజనకు కౌంటర్ ఇచ్చింది.