హీరోయిన్ పాయల్ ఘోష్ బాలీవుడ్ దర్శకుడ్ అనురాగ్ కశ్యప్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓ సందర్భంలో అనురాగ్ కశ్యప్ తనను గదిలో బలాత్కరించబోయడని, అసభ్య ప్రవర్తనతో ఇబ్బంది పెట్టారని సోషల్ మీడియా వేదికగా తెలియజేయడం జరిగింది. పాయల్ ఘోష్ ట్వీట్ బాలీవుడ్ లో ప్రకంపనలు రేపింది. ఈ విషయంలో పాయల్ కు కొందరు మద్దతు తెలుపుగా, మరికొందరు వ్యతిరేకత వ్యక్తం చేశారు. 

ఇక పాయల్ ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని, ఆమె ఉద్దేశపూర్వకంగా తనను ఈ వివాదంలోకి లాగారని వివరణ ఇచ్చారు. కాగా అనురాగ్ పై లైంగిక ఆరోపణలన నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. వర్మ ఈ విషయంలో అనురాగ్ కు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేయడం జరిగింది. 

వర్మ తన ట్వీట్ లో ఇరవై ఏళ్లుగా అనురాగ్ నాకు తెలుసు, ఇన్నేళ్ళలో ఆయన ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్లు వినడం కానీ, చూడడం కానీ జరగలేదు. అనురాగ్  చాలా సెన్సిటివ్ మరియు ఎమోషనల్ పర్సన్. ప్రస్తుత వివాదంలో అసలు ఏమి జరిగిందో అర్థం కావడం లేదు అని వర్మ ట్వీట్ చేయడం జరిగింది. వర్మ తన ట్వీట్  ద్వారా పరోక్షంగా పాయల్ ఘోష్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 

అనురాగ్ ని మరింత ఇరుకునబెట్టే ప్రయత్నంలో పాయల్ ఉండగా ఆయనకు అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు మద్దతు తెలపడం ఆసక్తి రేపుతోంది. బాలీవుడ్ లో రెండేళ్ల క్రితం  భారీ ఎత్తున మీ టూ ఉద్యమం నడిచింది. అప్పుడు కూడా పాయల్ అనురాగ్ పై ఏ విధమైన ఆరోపణలు చేయలేదు. ఇక హీరోయిన్ తనుశ్రీ దత్త సీనియర్ నటుడు నానా పటేకర్ పై తీవ్ర లైంగిక ఆరోపణలు చేయడం జరిగింది.