Asianet News TeluguAsianet News Telugu

పవన్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. మారుతి అనుమతి లేదా ? పొరపాటు జరిగిందా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 50వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల నుంచి అభిమానులకు వరుస అప్డేట్స్ వస్తుండడంతో సోషల్ మీడియా మోతెక్కుతోంది.

Director Maruthi name in pawan birth day celebrations of cast community
Author
Hyderabad, First Published Sep 2, 2021, 2:40 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 50వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల నుంచి అభిమానులకు వరుస అప్డేట్స్ వస్తుండడంతో సోషల్ మీడియా మోతెక్కుతోంది. కానీ పవన్ మాత్రం ఎప్పటిలాగే తన పుట్టిన రోజున మౌనం వహిస్తున్నారు. 

సినీ రాజకీయ ప్రముఖులంతా పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఫాన్స్ తమ తమ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పవన్ బర్త్ డే సెలబ్రేషన్స్ పేరుతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ క్యాస్ట్ పాలిటిక్స్, క్యాస్ట్ ట్యాగ్ కు దూరంగా ఉంటారు. 

కానీ ఆయన కమ్యూనిటీ మాత్రం పవన్ ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. పవన్ బర్త్ డే రోజున ఆయన సామాజిక వర్గం పేరుతో కొందరు బర్త్ డే సెలెబ్రేషన్ ప్లాన్ చేశారు. కొందరు సినీ ప్రముఖుల్ని కూడా ఈ సెలెబ్రేషన్స్ కి ఆహ్వానించాలని ప్రయత్నించారు. 

ఈ సెలెబ్రేషన్స్ కి దర్శకుడు మారుతి హాజరు కాబోతున్నట్లు మీడియాకు ఇన్విటేషన్ కూడా పంపారు. కానీ కొంత సేపటికే ఈ ఇన్విటేషన్ ని విరమించుకున్నారు. 

పవన్ బర్త్ డే ని ఆయన కమ్యూనిటీ సెలెబ్రేట్ చేసుకోవడం తప్పేమీ ఉండదు. కానీ ఆ ఈవెంట్ కు సెలెబ్రిటీలు హాజరైతే వారిపై కుల ముద్ర పడుతుంది. ఇలా మారుతి పేరు తెరపైకి రావడం, వెంటనే ఇన్విటేషన్ వెనక్కి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఇన్విటేషన్ లో మారుతి అనుమతి తీసుకునే ఆయన పేరు వేశారా లేదా అనేది క్లారిటీ లేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios